- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లాలో ఆగని హింస.. ప్రాణభయంతో కాలువలోకి దూకి హిందూ యువకుడు మృతి
బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 19 రోజుల్లో ఏడుగురు హిందువులు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 19 రోజుల్లో ఏడుగురు హిందువులు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. షేక్ హసీనా రాజీనామాతో మహ్మద్ యూనస్ నేతృత్వంతో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారినప్పటి నుంచి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. తాజాగా మరో యువకుడు.. ఇస్లామిస్ట్ గ్రూపులు చేసిన పనికి బలయ్యాడు. నౌగావ్ జిల్లాలోని మహాదేవ్ పూర్ సబ్ డిస్ట్రిక్ట్ లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బంగ్లా మీడియా పేర్కొన్న వివరాల ప్రకారం.. చాక్ గోరి ప్రాంతానికి చెందిన మిథున్ సర్కార్ (25) అనే యువకుడిపై కొందరు దొంగతనం నెపం మోపారు. ఆపై అతడిపై దాడి చేసేందుకు వెంబడించారు. వారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు.. ప్రాణభయంతో ఒక కాలువలోకి దూకాడు. ఆ కాలువ లోతు ఎక్కువగా ఉండటంతో పాటు.. నీటి ప్రవాహం కూడా బలంగా ఉండటంతో అందులో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా.. కొన్ని గంటల తర్వాత మిథున్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహాదేవ్ పూర్ పీఎస్ ఆఫీసర్ షాహిదుల్ ఇస్లాం తెలిపారు. కాగా.. ఈ వారంరోజుల్లో అక్కడి హిందువులపై జరిగిన దాడుల్లో ఇది మూడవది.






