పాకిస్తాన్‌లో 4.6 తీవ్రతతో మరో భూకంపం

by Malleboina Mahesh |

పాకిస్తాన్ లో ఈ రోజు మధ్యాహ్నం మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.

పాకిస్తాన్‌లో 4.6 తీవ్రతతో మరో భూకంపం
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ లో ఈ రోజు మధ్యాహ్నం మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. కాగా భూకంప తీవ్రత స్వల్పంగా ఉన్నప్పటికి పలు ప్రాంతాల్లో భారీగా కుదుపులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ తాజా భూకంపానికి సంబంధించిన సమాచారం అందుబాటులోకి రాలేదు. ఇదిలా ఉంటే నెల 10 భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో కూడా 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకొని విధుల్లోకి పరుగులు తీశారు. అది మరువక ముందే మరో భూకంపం రావడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది.

Next Story