మళ్లీ భూకంపం.. మూడు మీటర్ల ఎత్తుతో..

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-08 15:05:43  IST  )

మళ్లీ భూకంపం.. మూడు మీటర్ల ఎత్తుతో..

మళ్లీ భూకంపం.. మూడు మీటర్ల ఎత్తుతో..
X

దిశ, వెబ్‌డెస్క్: జపాన్(Japan) ప్రజలు మరోసారి హడలెత్తారు. జపాన్‌లోని టోక్యో నగరం(Tokyo City)లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో జపాన్‌ ఈశాన్య తీరంలో మూడు మీటర్ల ఎత్తుతో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు ఆదేశ వాతావరణ సంస్థ పేర్కొంది. అమోరి ప్రిఫెక్చర్‌ తీరానికి 80 కి.మీ దూరంలో, 50 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు సదరు ఏజెన్సీ తెలిపింది. ఇదిలా ఉంటే.. జపాన్, చైనా సైన్యాల మధ్య అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఒకినావా దీవుల సమీపంలో జపాన్ యుద్ధ విమానాలకు చైనా సైనిక విమానాలు తమ రాడార్‌ను లాక్ చేశాయని ఆరోపణలు రావడంతో జపాన్, చైనా దేశాల మధ్య దౌత్య వివాదం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో భూకంపం సంభవించడం, సునామీ హెచ్చరికలు రావడం జపాన్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

Next Story