ఆస్ట్రేలియా బాటలోనే మరో దేశం.. పిల్లలకు సోషల్ మీడియా నిషేధం?

by Naga Rani Yarlagadda |

తాజాగా ఆస్ట్రేలియా మాదిరిగానే మరో దేశం కూడా పిల్లలు సోషల్ మీడియా వాడటంపై ఆంక్షలు విధించే యోచనలో ఉంది.

ఆస్ట్రేలియా బాటలోనే మరో దేశం.. పిల్లలకు సోషల్ మీడియా నిషేధం?
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడటంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాదిరిగానే మరో దేశం కూడా పిల్లలు సోషల్ మీడియా వాడటంపై ఆంక్షలు విధించే యోచనలో ఉంది. మలేషియాలో ఈ విషయంపై తమ ప్రభుత్వం పరిశీలన చేస్తోందని దేశ కమ్యూనికేషన్ల మంత్రి ఫాహ్మి ఫడ్జిల్ తెలిపారు.

2026నాటికి తమ దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకుండా కండీషన్స్ పెట్టే ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలు తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తున్నామన్నారు. పిల్లల ఫ్యూచర్ ను కాపాడటంలో ప్రభుత్వం, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని ఫాహ్మి ఫడ్జిల్ తెలిపారు. మలేషియాలో సెప్టెంబర్లో వెలువడిన ఇప్సోస్ మలేషియా సర్వేలో 72 శాతం మంది ప్రజలు పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేయడాన్ని సమర్థించినట్లు వెల్లడించింది.

ఇక ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు 16 ఏళ్ల లోపు వయసున్న వారి అకౌంట్స్ ను తొలగించాలి. అలా చేయనిపక్షంలో ఆయా సోషల్ మీడియా యాజమాన్యాలు భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.

Next Story