- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఎయిరిండియా విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
ఎయిరిండియా విమానాలకు గడ్డు కాలం కొనసాగుతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరవకముందే మరో ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఎయిరిండియా విమానాలకు గడ్డు కాలం కొనసాగుతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరవకముందే మరో ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వెళుతున్న ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ AI315 విమానం టెక్నికల్ సమస్యలతో తిరిగి హాంకాంగ్ లో సేఫ్ గా ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా టెక్నికల్ ఇష్యూను పైలెట్ గుర్తించి సంబంధిత రాడార్ ద్వారా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కోరగా హాంకాంగ్ ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే అనుమతి ఇచ్చారు. దీంతో ప్లైట్ ను పైలెట్ సేఫ్ గా ల్యాండ్ చేశారు. సోమవారం ఉదయం హాంకాంగ్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళుతుండగా మధ్యలో టెక్నికల్ ఇష్యూను పైలెట్ గుర్తించి తిరిగి అదే ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కాగా సాంకేతిక లోపం ఏమిటన్నది ఇంకా గుర్తించలేదు. ప్లైట్ లో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేవని జాతీయా మీడియా వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ప్రయాణికులు సురక్షితం..
టెక్నికల్ ఇష్యూతో తిరిగి ఎయిర్ పోర్టు చేరుకున్న ఎయిరిండియా ఫ్లైట్ లో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. టెక్నికల్ ఇష్యూను సాల్వ్ చేసిన తర్వాత అదే ప్లైట్ ను తిరిగి పంపిస్తారా.. లేక వేరే దాంట్లో ప్రయాణికులను పంపిస్తారా అన్న విషయాన్ని ఎయిరిండియా ఇంకా ప్రకటించలేదు. ఇటీవల అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోగా.. విమానంలో 241 మందితో సహా మొత్తం 274 మంది మరణించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల అనంతరం మరో ఎయిరిండియా బోయింగ్ ప్లైట్ ఇలా టెక్నికల్ ఇష్యూస్ తో వెనుదిరిగి వెళ్లడంతో ఎయిరిండియా బోయింగ్ ప్లైట్స్ పై వాటి మెయింటెనెన్స్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read..






