జాతీయ రాజకీయాల్లోకి అన్నామలై: అమిత్ షా

by Shamantha N |

అన్నామలై జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు

జాతీయ రాజకీయాల్లోకి అన్నామలై: అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: అన్నామలై జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దీంతో పాటు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన పని చేయనున్నట్లు తెలిపారు. ఆయనకు జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిపారు. గత ఏప్రిల్‌లో, అన్నామలై తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత నైనార్ నాగేంద్రన్ కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అమిత్ షా అన్నామలై నాయకత్వాన్ని ప్రశంసనీయమైనదిగా అభివర్ణిస్తూ, తమిళనాడులో పార్టీని విస్తరించడంలో చేసిన కృషిని ప్రశంసించారు. అన్నామలై నైపుణ్యాలను బీజేపీ జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని అనుకుంటుందని అమిత్ షా ‘ఎక్స్’ లో స్పష్టం చేశారు.

అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తాం..

ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీ-అన్నాడీఎంకె ఎన్డీఏ కూటమి తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నాడీఎంకెలో నుంచే ఉంటారని తెలిపారు. కానీ మాజీ సీఎం ఎడప్పాడి కె. పళనిస్వామిని పేరు మాత్రం ప్రత్యేకంగా పేర్కొనలేదు. 1967లో ద్రవిడ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏ జాతీయ పార్టీ తమిళనాడు లో ప్రధాన పాత్ర పోషించలేకపోయింది. ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో బీజేపీ తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నదన్న సంకేతాలుగా భావిస్తున్నారు.

Next Story