కుప్పకూలిన అమెరికా ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-16సి.. వైరల్ అవుతోన్న వీడియో

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-07 14:10:41  IST  )

అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన థండర్‌బర్డ్స్ బృందానికి చెందిన ఒక F-16C ఫైటింగ్ ఫాల్కన్ యుద్ధ విమానం బుధవారం ఉదయం..

కుప్పకూలిన అమెరికా ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌-16సి.. వైరల్ అవుతోన్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన థండర్‌బర్డ్స్ బృందానికి చెందిన ఒక F-16C ఫైటింగ్ ఫాల్కన్ యుద్ధ విమానం బుధవారం ఉదయం దక్షిణ కాలిఫోర్నియా ఎడారి ప్రాంతంలో కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియోను Mossad Commentary అనే సంస్థ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ట్రోనా విమానాశ్రయానికి సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10:45 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆరు థండర్‌బర్డ్స్ జెట్లలో ఒకటి ఈ ప్రమాదానికి గురైంది.

విమానంలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగి ఆకాశంలో దట్టమైన నల్ల పొగ ఆవరించింది. అయితే ప్రమాదానికి ముందే పైలట్ సురక్షితంగా పారాచ్యూట్ తో బయటపడ్డాడు. పారాచ్యూట్‌తో కిందకు దిగిన ఆ పైలట్‌కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే రిడ్జ్‌క్రెస్ట్‌లోని ఆసుపత్రికి తరలించారు. థండర్‌బర్డ్స్ అధికారిక బృందం ఈ ఘటనను ధృవీకరించింది. పైలట్ ఈజెక్ట్ అవుతూ, విమానం కిందపడటం, మంటలు చెలరేగడం సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదానికి గల కారణాలపై అమెరికన్ ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ ఎప్పటి నుంచో ఎఫ్-16 జెట్లతో నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాగా.. కుప్పకూలిన ఎఫ్ -16 ఫైటింగ్ జెట్ లో కేవలం ఒక ఇంజిన్ మాత్రమే ఉంది.

Next Story