- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగని యుద్ధం..మరోసారి ఇరాన్ పై అమెరికా మెరుపుదాడులు
అమెరికా ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ పై అమెరికా మెరుపుదాడులకు పాల్పడుతోంది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ పై అమెరికా మెరుపుదాడులకు పాల్పడుతోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ గోరుక్ ప్రాంతంలో, ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ రాడార్ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఆత్మరక్షణ దాడులకు పాల్పడింది. మరోవైపు కువైట్ లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. అమెరికాకు చెందిన MQ-1 డ్రోన్ ను ఇరాన్ కూల్చివేయడంతో పాటు దూకుడుగా వ్యవహరిస్తోంది.
ఈ నేపథ్యంలోనే అమెరికా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది. అమెరికా చేసిన దాడుల్లో ఆ దేశ యుద్ధ విమానాలు ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను, ఓ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, రెండు వన్ వే ఎటాక్ డ్రోన్ లను సైతం ధ్వంసం చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఇరాన్ పై జరిపిన ఆపరేషన్ పై అమెరికా స్పందించింది. ఇరాన్ దాడుల్లో తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని తెలిపింది. శత్రు దేశాల నుండి ఎలాంటి బెదిరింపులు, ప్రతిస్పందనలు వచ్చినా తమ దేశప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇరాన్ ను హెచ్చరించింది.






