మంచు గుప్పిట్లో అమెరికా.. 13,000 విమానాలు రద్దు

by Ajay Maddhiboyina |

మంచు గుప్పిట్లో అమెరికా.. 13,000 విమానాలు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: భారీ మంచు తుఫాన్ (మాన్ స్టర్ స్టార్మ్) అమెరికాను కమ్మేసింది. నైరుతి ప్రాంతంలోని న్యూమెక్సికో నుండి ఈశాన్యంలోని న్యూఇంగ్లాండ్ వ‌ర‌కు సుమారు 14కోట్ల మంది ప్ర‌జ‌ల‌పై తుఫాన్ ఎఫెక్ట్ ప‌డింది. దీంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఏర్పండి. బ‌య‌ట పార్క్ చేసిన కార్లు సైతం క‌ద‌ల్లేని ప‌రిస్థితిలో ఉన్నాయి. తుఫాన్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని, అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని అధికారులు చూసిస్తున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప‌లు రాష్ట్రాల్లో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. ఫెడ‌ర‌ల్ ఎమ‌ర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ స‌హాయ‌క బృందాల‌ను, నిత్యావ‌స‌రాల‌ను సిద్ధం చేసింద‌ని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్ర‌ట‌రీ క్రిస్టి నోయ‌మ్ చెప్పారు. మ‌రోవైపు తుఫాన్ కార‌ణంగా దాదాపు 13వేల విమానాలు ర‌ద్దైన‌ట్టు ఫ్లైట్ అవేర్ వెబ్ సైట్ పేర్కొంది. డ‌ల్లాస్ ఫోర్ట్ వ‌ర్త్, అట్లాంటా, షార్లెట్, చికాగో లాంటి ప్ర‌ధాన విమానాశ్ర‌యాల్లో కార్య‌క‌లాపాలు నిలిచిపోయిన‌ట్టు చెప్పారు.

Next Story