AMERICA-VENEZUELA: అన్నంత పనిచేసిన ట్రంప్.. ప్రపంచంలో యుద్ధం మొదలైందా?

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-03 08:26:08  IST  )

వెనుజులా రాజధాని కరాకస్ లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలంతా వీధుల్లోకి పరుగులు తీశారు.

AMERICA-VENEZUELA: అన్నంత పనిచేసిన ట్రంప్.. ప్రపంచంలో యుద్ధం మొదలైందా?
X

దిశ, వెబ్ డెస్క్: వెనుజులా రాజధాని కరాకస్ లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలంతా వీధుల్లోకి పరుగులు తీశారు. మొత్తం ఏడు చోట్ల పేలుళ్లు సంభవించగా విమానం తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నట్టు తమకు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజులాకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ దేశ గగనతలంపైనా ట్రంప్ ఆంక్షలు విధించారు. రోడ్డు, స‌ముద్ర మార్గం ద్వారా అమెరికాలోకి డ్ర‌గ్స్ రవాణా నిలిపివేయాల‌ని వార్నింగ్ ఇచ్చాడు.

ఇప్ప‌టికే క‌రేబియ‌న్ దీవుల్లో త‌మ యుద్ధ‌నౌక‌లు మోహ‌రించి ఉన్నాయ‌ని దాడి చేస్తామ‌ని హెచ్చ‌రించాడు. అంతే కాకుండా వెనుజులా అధ్య‌క్షుడు నికోల‌స్ మ‌దురో ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని చెప్పాడు. ఇక తాజాగా ట్రంప్ చెప్పిన‌ట్టుగానే వెనుజులాపై మెరుపు దాడులు మొద‌ల‌య్యాయి. రాజ‌ధాని క‌రాక‌స్ లో బ‌హుళ అంత‌స్తులు మంటల్లో చిక్కుకున్నాయి. వెనుజులా ఆర్మీ స్థావ‌రాల‌పైనా దాడులు జ‌రిగాయి. మ‌రోవైపు స‌ముద్రంలోని ప‌డ‌వ‌ల‌పై సైతం కాల్పులు జ‌రిపి బూడిద చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికా వెనుజులాపై దాడులు చేయడంతో ఆ దేశం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ డ్రగ్స్ ను అరికట్టాలి అనే ఉద్దేశం ఉంటే అమెరికా తమతో చర్చలు జరపాలి అని గతంలో వెనుజులా అధ్యక్షులు చెప్పాడు. కానీ అమెరికా చర్చలకు వెళ్లకుండా పదే పదే వార్నింగ్ ఇస్తే ఇప్పుడు దాడి చేసింది. మరి ఈ దాడికి వెనుజులా ప్రతీకారం తీర్చుకుంటే రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదు. అదే జరిగితే వెనుజులా చిన్నదేశం కావడంతో అమెరికాను ఢీ కొట్టడం అంత ఈజీ కాదు. కాబట్టి తమ మిత్ర దేశం రష్యా సపోర్ట్ అవసరం అవుతుంది. ఇలాంటి సమయంలో వెనుజులా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Next Story