Amarnath Yatra 2026: లాంఛనంగా అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం..హెలికాప్టర్ సేవలు బంద్!

by Ramesh Naini |   (  Updated:2026-06-29 11:51:04  IST  )

ప్రతిష్టాత్మక శ్రీ అమర్‌నాథ్ జీ యాత్ర-2026 లాంఛనంగా ప్రారంభమైంది.

Amarnath Yatra 2026: లాంఛనంగా అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం..హెలికాప్టర్ సేవలు బంద్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతిష్టాత్మక శ్రీ అమర్‌నాథ్ జీ యాత్ర-2026 లాంఛనంగా ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సోమవారం పవిత్ర గుహాలయంలో మంచు లింగానికి శాస్త్రోక్తంగా ‘ప్రథమ పూజ’ నిర్వహించి యాత్రకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబా బర్ఫానీ ఆశీస్సులతో ప్రజలందరూ శాంతి, శ్రేయస్సులతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

యాత్రకు సంబంధించిన ముఖ్య వివరాలు...

యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 28 (శ్రావణ పౌర్ణమి, రక్షా బంధన్) వరకు మొత్తం 57 రోజుల పాటు కొనసాగుతుంది. యాత్రికులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా స్థానిక యంత్రాంగం, ఆర్మీ, భద్రతా దళాలు, పుణ్యక్షేత్రాల బోర్డు సమన్వయంతో మౌలిక సదుపాయాలు సహా పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు. కశ్మీర్ హిమాలయాల్లోని అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3,880 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహకు ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి. సంప్రదాయ పహల్గామ్ మార్గం ద్వారా వెళితే 4 రోజులు పడుతుంది. అదే బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి వెళ్తే ఒకే రోజులో దర్శనం చేసుకుని తిరిగి రావచ్చు.

గమనిక.. ‘నో-ఫ్లై జోన్’గా యాత్రా మార్గం

ఈ ఏడాది యాత్రలో అధికారులు కీలక మార్పు చేశారు. బేస్ క్యాంపులైన పహల్గామ్, బల్తాల్ నుంచి పవిత్ర గుహకు వెళ్లే మార్గాన్ని ‘నో-ఫ్లై జోన్’గా ప్రకటించారు. దీని కారణంగా ఈసారి భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉండనట్లు తెలుస్తోంది. యాత్రికులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.

Next Story