అన్నవరం వెళ్తుండగా విషాదం.. భర్త కళ్లెదుటే రెండు వాహనాల మధ్య భార్య దుర్మరణం

by Naga Rani Yarlagadda |

అనకాపల్లి జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డుప్రమాదం.. ఓ భర్తను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

అన్నవరం వెళ్తుండగా విషాదం.. భర్త కళ్లెదుటే రెండు వాహనాల మధ్య భార్య దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డుప్రమాదం.. ఓ భర్తను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కళ్లెదుటే భార్య రెండు వాహనాల మధ్య నలిగిపోయి చనిపోతుంటే.. చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. పెందుర్తికి చెందిన ఒలిపల్లి ఈశ్వరరావు, భార్య గాయత్రి (24) టూ వీలర్ పై అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనానికి బయల్దేరారు. కాగిత వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన వ్యాన్ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఈశ్వరరావు కిందపడిపోగా.. గాయత్రి ఎగిరి వ్యాన్ పై పడింది. చూస్తుండగానే క్షణాల్లోనే వ్యాన్ వేగంగా లారీని ఢీ కొట్టింది. దీంతో రెండు వాహనాల మధ్య నలిగి గాయత్రి అక్కడికక్కడే దుర్మరణం పాలయింది. ఈ ఘోర ప్రమాదంతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. గాయాలతో బయటపడిన ఈశ్వరరావు.. ప్రాణానికి ప్రాణమైన భార్య తన కళ్లముందే చనిపోవడంతో గుండెలవిసేలా రోదించాడు. గాయత్రి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో నక్కపల్లి - తుని రోడ్డులో చాసా సమయంపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

Next Story