- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cost of Living: బెంగళూరు టెకీ నెలవారీ ఖర్చు రూ.71 వేలు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
బెంగళూరు నగరంలో జీవన వ్యయంపై సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరు నగరంలో జీవన వ్యయం (Cost of Living) పై సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. అంజలి అనే ఐటీ ఉద్యోగిని తన నెలవారీ ఖర్చుల వివరాలను వివరిస్తూ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అట్లాసియన్ (Atlassian) కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమె.. గత మే నెలలో తనకు ఏకంగా రూ.71 వేలు ఖర్చయిందని, బెంగళూరు లాంటి నగరంలో ఇదేమంత పెద్ద మొత్తం కాదని పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది.
ఆమె ఖర్చుల వివరాలు ఇలా..
తన ఆఫీసులోనే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అలాగే రవాణా కోసం క్యాబ్ సదుపాయం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ఖర్చు కావడం గమనార్హం. అద్దె.. 1 BHK ఫ్లాట్ రెంట్, మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.28,000. టూర్లు.. వీకెండ్స్‌లో 3- 4 రోజుల ట్రిప్‌ల కోసం రూ.15,000 నుంచి రూ.20,000. వీకెండ్ ఖర్చులు.. బయట భోజనం, షాపింగ్ కోసం రూ.12,000 నుంచి రూ.15,000. ఆహారం.. రాత్రి భోజనం వండేందుకు కుక్, కిరాణా సరుకులకు కలిపి సుమారు రూ.7,000. జిమ్, వైఫై, సబ్‌స్క్రిప్షన్లకు రూ.3,000, కరెంట్, నీటి బిల్లులకు రూ.1,000.. ఖర్చు చేస్తున్నట్లు టెకీ వెల్లడించింది.
భవిష్యత్తు కోసం పొదుపు చేయండి: నెటిజన్‌లు
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ‘ఈమె కేవలం ఖర్చు పెట్టడానికే పుట్టింది’, ‘ఆమె పెట్టే ఖర్చు.. బెంగళూరులో చాలా మంది నెలాఖరు జీతం’, ‘మేము కేవలం రూ.10 వేలతోనే బతికేస్తున్నాం’ అంటూ ఆశ్చర్యం, సెటైర్లు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని సలహాలు ఇస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బెంగళూరులో పెరిగిన అద్దెలు, జీవన ప్రమాణాల దృష్ట్యా మంచి లొకేషన్‌లో ఉండేవాళ్లకి ఆ ఖర్చు సమంజసమేనని అభిప్రాయపడుతున్నారు. ఆర్థికంగా ఎలాంటి బాధ్యతలు లేని యువత, డబ్బును దాచుకోవడం కంటే ఇలా ఎంజాయ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయం, యువ ఉద్యోగుల ఖర్చు అలవాట్లపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.






