- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ వార్తకు స్పందన.. 64 స్మారకాలపై కేంద్రానికి ప్రతిపాదనలు: హెరిటేజ్ శాఖ
రాష్ట్రంలో కేవలం 10 స్మారకాలే పేరిట దిశలో ప్రచురితమైన వార్తకు తెలంగాణ రాష్ట్ర హేరిటేజ్ విభాగం స్పందించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కేవలం 10 స్మారకాలే పేరిట దిశలో ప్రచురితమైన వార్తకు తెలంగాణ రాష్ట్ర హేరిటేజ్ విభాగం స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర శాఖ కేంద్ర పురావస్తు శాఖకు పంపిన ప్రతిపాదనల వివరాలను ఆ శాఖ డైరెక్టర్ అర్జున్ రావు కుతాడి సోమవారం తెలిపారు. రాష్ట్రంలో తమ శాఖ పరిధిలో 346 సంరక్షిత స్మారక చిహ్నాలు ఉన్నాయన్నారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన 64 రాష్ట్ర సంరక్షిత స్మారక చిహ్నాలను కేంద్ర సంరక్షిత స్మారక చిహ్నాలుగా ప్రకటించడం కోసం కేంద్ర పురావస్తు శాఖ పరిశీలనకు సిఫార్సు చేస్తూ సమగ్ర ప్రతిపాదనను పంపామన్నారు. వీటిలో 40 సంరక్షిత స్మారక చిహ్నాలను, 24 సంరక్షిత కానీ స్మారక చిహ్నాలు ఉన్నాయన్నారు. తాము పంపిన ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ పరిశీలనలో ఉందని, తుది నిర్ణయం తీసుకోలేదని అర్జున్ రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టబద్దమైన ప్రక్రియను పూర్తి చేసి అవసరమైన నోటిఫికేషన్‌ను జారీ చేసే వరకు తెలంగాణలో కేంద్ర సంరక్షిత స్మారక చిహ్నాల సంఖ్యలో మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.






