అమెరికా వరదల్లో గల్లంతైన తెలుగు యువకుడు మృతి.. కారు సమీపంలోనే మృతదేహం గుర్తింపు

by Ramesh Naini |

అమెరికాలోని కాన్సాస్‌ ప్రాంతంలో తాజాగా సంభవించిన వరదల్లో గల్లంతైన బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేశ్‌ విగతజీవిగా కనిపించాడు.

అమెరికా వరదల్లో గల్లంతైన తెలుగు యువకుడు మృతి.. కారు సమీపంలోనే మృతదేహం గుర్తింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలోని కాన్సాస్‌ ప్రాంతంలో తాజాగా సంభవించిన వరదల్లో గల్లంతైన బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేశ్‌ (32) విగతజీవిగా కనిపించాడు. అతడి మృతదేహం తన కారుకు సమీపంలోనే బురదలో కూరుకుపోయి ఉన్నట్లు అమెరికా పోలీసులు గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మూడేళ్ల క్రితం ఉన్నత విద్య (MS) కోసం అమెరికా వెళ్లిన వెంకటేశ్‌, చదువు పూర్తిచేసుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.

గాలింపు చర్యలు.. ప్రభుత్వ ప్రయత్నాలు

కాన్సాస్‌ వరదల్లో కారుతో సహా గల్లంతైన వెంకటేశ్‌ కోసం గాలింపు చేపట్టగా.. ముందుగా కారు, బ్యాగ్ మాత్రమే లభ్యమయ్యాయి. తాజాగా బురదలో కూరుకుపోయిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. యువకుడి ఆచూకీ కనుగొనేలా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌లకు ముందే లేఖలు రాశారు. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో వెంకటేశ్‌ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘోర విషాదంతో స్వగ్రామం దేవరపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.

Next Story