- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పొరేటర్ తమ్ముడి హవా.. దళిత కుటుంబం పై దాడి
స్థానికంగా ఓ కార్పొరేటర్ తమ్ముడు దళిత కుటుంబం పై దాడికి పాల్పడిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

దిశ, కొత్తగూడెం టౌన్ : స్థానికంగా ఓ కార్పొరేటర్ తమ్ముడు దళిత కుటుంబం పై దాడికి పాల్పడిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. వ్యక్తిగత వివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో బాధిత కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ, శారీరకంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడిలో గాయపడిన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బూడిదగడ్డకు చెందిన భువనేశ్వరి, రామకృష్ణుడు చేసిన ఫిర్యాదు ప్రకారం, గతంలో శివరామకృష్ణ, భువనేశ్వరి దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు.
అదేవిధంగా సోమవారం కూడా తమ ఇంట్లో గొడవ జరుగుతుండగా, తన భర్త తనను తిడుతుండగా సాయంత్రం 6 గంటల సమయంలో బోయిన శ్రీరాములు, బోయిన రవి, సంయుక్త, ఆమె భర్త రాజశేఖర్, బోయిన సతీష్‌లు తమను, తన భర్తను, తన ఆడపడుచుతో పాటు తన కుమారుడిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చేతులతో కొట్టి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అకారణంగా దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. దాడికి గల కారణాలు, ఇరువర్గాల మధ్య జరిగిన వివాద వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.






