- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల దీవెనతో సభ విజయవంతం : నల్గొండ డీసీసీ అధ్యక్షుడు
ప్రజల దీవెనలతో సీఎం రేవంత్ రెడ్డి సభ విజయవంతమైందని, ఈ సభను విజయవంతం చేసిన నల్గొండ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

దిశ, నల్లగొండ బ్యూరో : ప్రజల దీవెనలతో సీఎం రేవంత్ రెడ్డి సభ విజయవంతమైందని, ఈ సభను విజయవంతం చేసిన నల్గొండ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం స్థానిక యాదవ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ఆదరణ పొందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మరోసారి రుజువైందన్నారు. దీంతో ప్రతిపక్షాలు దిక్కుతోచక అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ సభకు భారీగా హాజరైన నల్గొండ మహిళా సోదరీమణుల ఆకాంక్ష మేరకు సీఎం రేవంత్ రెడ్డి వారికి అండగా నిలబడ్డారని అన్నారు. దేశంలోనే ఆదర్శ పాలన అందిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరోసారి తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లాకు చేకూరిన ప్రయోజనం శూన్యమని, అయితే గత రెండున్నరేళ్ల పాలనలో వేల కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, నెల్లికల్, కిష్టరాంపల్లి రిజర్వాయర్, బ్రాహ్మణవెల్లంల, చర్లగూడెం రిజర్వాయర్‌లను పూర్తిచేయకుండా నల్గొండ రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం వంచించిందని ఆరోపించారు. ఇప్పుడు అదే పార్టీ ముసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులను రాజులను చేస్తామని సీఎం హామీ ఇవ్వడం పై ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలో చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, ఎండీ ముంతాజ్ అలీ, మేకల రాజేందర్ రెడ్డి, దామనూరి అశోక్, చర్లపల్లి గౌతం, పగిళ్ల రాజు, వేముల గోపీనాథ్, వెంకటరత్నం, గుర్రం కోటేష్, ఎండీ అజీజ్, సయ్యద్ నాగుల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.






