- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.

దిశ, నకిరేకల్ : పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. సోమవారం కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత పదేళ్లలో ఒక్క పేద కుటుంబానికీ రేషన్ కార్డులు అందలేదని, ప్రస్తుతం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తున్నామని గుర్తు చేశారు.
పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని ఉద్దేశంతో రూ.5 లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించేందుకే ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వం దాచుకోవడం, దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓర్చుకోలేక అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. నకిరేకల్ నియోజకవర్గంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి వారి ఇబ్బందులను తొలగించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






