- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడి
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాల గ్రామ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన డంపింగ్ యార్డు (ఎకో టౌన్ ప్రాజెక్టు)కు వ్యతిరేకంగా పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు.

దిశ, ఇబ్రహీంపట్నం : అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాల గ్రామ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన డంపింగ్ యార్డు (ఎకో టౌన్ ప్రాజెక్టు)కు వ్యతిరేకంగా పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. సోమవారం బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 15 గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రజలు డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీఎస్పీ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామా మల్లేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే వేలాది మంది ప్రజలతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం దాసోజు శ్రవణ్, క్యామా మల్లేష్ మాట్లాడుతూ, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం సరికాదన్నారు.
బండరావిరాల, చిన్నరావిరాల, పిల్లాయిపల్లి, బాచారం, పెద్దగూడెం తదితర గ్రామాల ప్రజలు ఇప్పటికే మూసీ కాలుష్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు మరోసారి డంపింగ్ యార్డు భారాన్ని మోపడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ జోన్ కారణంగా నష్టపోయిన బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ప్రజావాణిలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బండరావిరాల సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్, చిన్నరావిరాల సర్పంచ్ పబ్బత్ బాలకిషన్ గౌడ్, పిల్లాయిపల్లి సర్పంచ్ పెరుమాళ్ల మహాలక్ష్మి దానయ్య, దేశముఖి సర్పంచ్ దుర్గం జంగయ్య యాదవ్, జగత్‌పల్లి సర్పంచ్ ఇట్టమోని మహేష్ యాదవ్, పెద్దగూడెం సర్పంచ్ నర్సిరెడ్డి, కవాడిపల్లి సర్పంచ్ కొలను ప్రసన్నలక్ష్మి రవీందర్ రెడ్డి, బలిజగూడ సర్పంచ్ కొప్పు మాధవి నవీన్, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






