గోవిందపురం–వల్లాపురం రహదారి పనులు వెంటనే ప్రారంభించాలి : జానేష్ ఆగ్రహం

by Batti.Sumithra |

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండల పరిధిలోని ఎల్.గోవిందపురం నుంచి వల్లాపురం వరకు నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేసి చాలా కాలం గడిచినా, ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదని బోనకల్ మండల వైసీపీ అధ్యక్షుడు ఇరుగు జానేష్ విమర్శించారు.

గోవిందపురం–వల్లాపురం రహదారి పనులు వెంటనే ప్రారంభించాలి : జానేష్ ఆగ్రహం
X

దిశ, బోనకల్ : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండల పరిధిలోని ఎల్.గోవిందపురం నుంచి వల్లాపురం వరకు నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేసి చాలా కాలం గడిచినా, ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదని బోనకల్ మండల వైసీపీ అధ్యక్షుడు ఇరుగు జానేష్ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ గోవిందపురం నుంచి వల్లాపురం వరకు ఉన్న రహదారి రైతులు, యువతతో పాటు గ్రామస్థులకు ప్రధాన రవాణా మార్గమని తెలిపారు. అయితే మధ్యలో ఉన్న వాగుపై వంతెన నిర్మించకపోవడం, రహదారి పై కనీసం మట్టి కూడా వేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రత్యేకించి వర్షాకాలంలో వాగులో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులు పండించిన పంటలను తరలించడంలో కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోవిందపురం నుంచి వల్లాపురం ప్రాంతాలకు వెళ్లే ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారి పనులను ప్రారంభించి, వాగుపై వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని, వెంటనే చర్యలు తీసుకుని రైతాంగాన్ని ఆదుకోవాలని వైసీపీ మండల అధ్యక్షుడు ఇరుగు జానేష్ ప్రభుత్వాన్ని కోరారు.

Next Story