- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌కు హిజ్బుల్లా మద్దతు.. అలీ ఖమేనీ ఆశయాలు కొనసాగించాలని పిలుపు
ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికైన మోజ్తాబా ఖమేనీకి హిజ్బుల్లా చీఫ్ నయీమ్ ఖాసిం తన పూర్తి మద్దతును ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికైన మోజ్తాబా ఖమేనీకి హిజ్బుల్లా చీఫ్ నయీమ్ ఖాసిం తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం పట్ల హిజ్బుల్లాకు ఉన్న విధేయతను చాటుకున్నారు. ఈ మేరకు స్థానిక 'అల్-మనార్' వార్తా సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇరాన్ 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' మోజ్తాబా ఖమేనీని అత్యున్నత నాయకుడిగా ఎన్నుకోవడాన్ని ఖాసిం స్వాగతించారు. అయతుల్లా రూహోల్లా ఖొమేనీ స్థాపించిన విప్లవాత్మక సిద్ధాంతాలను, దివంగత నేత అలీ ఖమేనీ కొనసాగించిన పంథాను మోజ్తాబా అదే విధంగా ముందుకు తీసుకెళ్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హిజ్బుల్లా కట్టుబడి ఉంటుంది..
గత ఇరాన్ నాయకులకు అందించిన విధంగానే, నూతన నాయకత్వానికి కూడా హిజ్బుల్లా కట్టుబడి ఉంటుందని ఖాసిం స్పష్టం చేశారు. ఇరాన్ అనుసరిస్తున్న ‘అసలైన ఇస్లామిక్ విప్లవ మార్గం’ మోజ్తాబా నాయకత్వంలో మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆక్రమణలకు, దురాక్రమణలకు వ్యతిరేకంగా తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఖాసిం ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కాగా, గత నెల ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన వైమానిక దాడిలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి నిరసనగా హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులు చేయగా, ప్రతిచర్యగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్, బీరూట్ పరిసర ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ మోజ్తాబా ఖమేనీ పగ్గాలు చేపట్టడం పశ్చిమ ఆసియా రాజకీయాల్లో కీలకంగా మారింది.






