ఇక సైకిలే దిక్కు.. మోడీకి అఖిలేష్ యాదవ్ కౌంటర్

by Ajay Maddhiboyina |

పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. పరోక్షంగా సోషల్ మీడియాలో మోడీ ప్రభుత్వంపై అఖిలేష్ విమర్శలు కురిపించారు.

ఇక సైకిలే దిక్కు.. మోడీకి అఖిలేష్ యాదవ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. పరోక్షంగా సోషల్ మీడియాలో మోడీ ప్రభుత్వంపై అఖిలేష్ విమర్శలు కురిపించారు. అఖిలేష్ ఎక్స్ లో చేసిన పోస్టులో.. స‌మాజ్ వాదీ పార్టీ గుర్తు సైకిల్‌ను తాను నడిపిస్తున్నట్టు ఉన్న ఫోటో కార్టూన్ ఫోటోను షేర్ చేశారు. మీరు ముందుకు సాగాలి అంటే సైకిల్ ఒకటే మార్గం అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు.

మోడీ ఇంధనం వాడకం తగ్గించాలి, పొదుపు చేయాలి అని చేసిన వ్యాఖ్యల తరవాత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేయడంతో ఆయన మెడీకే కౌంటర్ వేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అఖిలేష్ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్ ధరలను లీటర్ రూ.3.14, డీజిల్ లీటర్ ధర రూ.3.11 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు పూర్తైన వెంటనే మోడీ ఇంధనం గురించి మాట్లాడటం, ధరలు పెంచడంతో బీజేపీ పై తీవ్ర విమర్శలు సైతం వస్తున్నాయి.

Next Story