- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Osaka: సముద్రంపై తేలియాడే విమానాశ్రయం.. ఇంకొన్ని ఏళ్లలో మునిగిపోతుందా? ఎక్కడంటే?
ప్రపంచంలోనే అద్భుతమైన సముద్రంపై తేలియాడే ఓ విమానాశ్రయం వచ్చే కొన్నేళ్లలో కనుమరుగు అవ్వబోతుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోనే అద్భుతమైన సముద్రంపై తేలియాడే ఓ విమానాశ్రయం వచ్చే కొన్నేళ్లలో కనుమరుగు అవ్వబోతుంది. (Japan) జాపాన్‌లోని గ్రేటర్ ఒసాకా (Osaka Bay) బే లో మానవ నిర్మిత ద్వీపంపై 20 బిలియన్ డాలర్లు వెచ్చించి నిర్మించిన (Kansai Airport) కాన్సాయ్ ఎయిర్‌పోర్టు మెల్లమెల్లగా మునిగిపోతోందని సంకేతాలు వస్తున్నాయి. 1994లో ప్రారంభం అవ్వగా.. ఇప్పుడు క్రమంగా విమానాశ్రయం మునిగిపోతోందని తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విమానాశ్రయం రెండు ద్వీపాలపై నిర్మించగా.. ఇప్పటి దాకా 13.66 మీటర్లు కుంగిపోయింది. రెండో ద్వీపం 21 సెంటీ మీటర్ల వరకు కుంగిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇంకొన్ని సంవత్సరాల్లో.. ఇది పూర్తిగా మునిగిపోతుందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. దీంతో విమానాశ్రయానికి అదనపు నష్టాన్ని ఆపడానికి జపాన్ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోంది.
1980లో ఈ విమానశ్రయం అధునాతన గ్రౌండ్ ఇంప్రూవ్‌మెంట్ టెక్నిక్‌లను ఉపయోగించి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ ఎయిర్‌పోర్టు (Airport) ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. 2024లో ప్రపంచంలోనే అత్యుత్తమ లగేజీ నిర్వహణ విమానాశ్రయం గా పేరు పొందింది. దాదాపు పదేళ్ల కు పైగా ప్రయాణికుల లగేజీ మిస్ కాకుండా ఖచ్చితమైన రికార్డును కొనసాగిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. జపాన్‌లోని ఎయిర్ పోర్టులో రద్దీని తగ్గించడానికి ఒసాకాలో విమాశ్రయం నిర్మించారు. 2024లో సుమారు 30 మిలియన్ల మందికి పైగా ప్రయాణికులు దాని టెర్మినల్స్ గుండా 25 దేశాలలోని 91 నగరాలకు ప్రయాణించారు. 2018లో తుఫాను వచ్చిన సమయంలో విమానాశ్రయం పూర్తిగా మునిగిపోయి.. దీని లోపాలు బయటపడ్డాయి. ఆ సమయంలో దాదాపు 5,000 మంది ప్రయాణికులు 24 గంటల పాటు విద్యుత్ లేకుండా చిక్కుకున్నారు. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు ఎయిర్‌పోర్టు తీర ప్రాంతాలను చెక్ చేస్తూ ఉంటారు.






