83 మంది సంతానంతో లేడీ మినిస్టర్.. ఒక్కో ఎంపీకి ఒక్కో బిడ్డ..

by Sujitha Rachapalli |

అల్బేనియా దేశం ఏఐ పరిపాలనకు శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి ఎడి రామా ఇప్పటికే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద మొట్టమొదటి ఏఐ మంత్రి డియెల్లాను నియమించారు. ఈ ప్రయోగంతో గవర్నెన్స్‌లో పలు మంచి మార్పులు చోటు చేసుకోగా..

83 మంది సంతానంతో లేడీ మినిస్టర్.. ఒక్కో ఎంపీకి ఒక్కో బిడ్డ..
X

దిశ, వెబ్ డెస్క్ : అల్బేనియా దేశం ఏఐ పరిపాలనకు శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి ఎడి రామా ఇప్పటికే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద మొట్టమొదటి ఏఐ మంత్రి డియెల్లాను నియమించారు. ఈ ప్రయోగంతో గవర్నెన్స్‌లో పలు మంచి మార్పులు చోటు చేసుకోగా.. ఇప్పుడు డియెల్లా 83 డిజిటల్ సంతానంతో గర్భవతిగా ఉన్నట్లు ప్రకటించాడు. అంటే 83 మంది సోషలిస్ట్ పార్టీ సభ్యుల కోసం 83 ఏఐ అసిస్టెంట్లను అందించబోతున్నట్లు బెర్లిన్‌లో జరిగిన గ్లోబల్ డైలాగ్ ఈవెంట్‌లో తెలిపాడు.

ఏఐ అసిస్టెంట్స్ నెట్ వర్క్ :

* డియెల్లా 83 మంది సంతానం.. అంటే స్పెషల్ ఏఐ ఏజెంట్లు పార్లమెంటరీ వర్క్ ఫ్లోలో భాగం కానున్నాయి.

* రియల్ టైమ్ సెషన్‌ను మానిటరింగ్ చేసి.. మీటింగ్స్ రికార్డ్ చేస్తాయి. బ్రేక్ కోసం బయటకు వెళ్లిన ఎంపీలకు తక్షణ ఇన్ఫర్మేషన్ అందిస్తాయి.

* రిపోర్టింగ్‌తో పాటు ప్రతివాదనలను కూడా సూచిస్తాయి. ప్రత్యర్థులను గుర్తించి.. వ్యూహాత్మక సలహాలు అందిస్తాయి.

* 2026లో ఈ పథకం అమలులోకి రానుంది. కాగా డియెల్లా అసిస్టెంట్స్ ఈయూ చట్టాలు, పార్లమెంటరీ విధానాలు, అవినీతి వ్యతిరేక ప్రోటోకాల్స్‌కు సంబంధించిన నాలెడ్జ్‌‌‌ను వారసత్వంగా పొందుతాయి. ఇంటర్‌కనెక్టెడ్ ఫ్లీట్‌గా ఉండిపోతాయి.

డియెల్లా గురించి..

జనవరి 2025లో e-అల్బేనియా పోర్టల్‌లో వర్చువల్ హెల్పర్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డియెల్లాను యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సర్టిఫికేట్ అభ్యర్థనలు, వ్యాపార నమోదులు, ఇతర సేవలతో సహా ఒక మిలియన్‌కు పౌర సేవలను వేగంగా నిర్వహించింది. దీంతో సెప్టెంబర్‌లో డియెల్లాను మంత్రిగా ప్రకటించిన పీఎం రామా.. ప్రపంచంలోనే మొట్టమొదటి AI క్యాబినెట్ సభ్యురాలిగా పేర్కొన్నారు. సాంప్రదాయ అల్బేనియన్ దుస్తులలో ఒక పరిపూర్ణ మహిళగా రూపొందించబడిన డియెల్లా లక్ష్యం.. ఆటోమేటెడ్, పారదర్శక నిర్ణయాధికారం ద్వారా పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌ను వందశాతం అవినీతి-రహితంగా మార్చడమే.

Next Story