Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. తుర్కియే కీలక ప్రకటన

by Shamantha N |   (  Updated:2025-06-15 06:47:32  IST  )

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా బోయింగ్ బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్ విమానానికి తాము మెయింటెనెన్స్ చేయలేదని తుర్కియే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. తుర్కియే కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా బోయింగ్ బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్ విమానానికి తాము మెయింటెనెన్స్ చేయలేదని తుర్కియే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తమ దేశానికి చెందిన సంస్థే ప్రమాదంలో కూలిపోయిన విమానానికి మెయింటెనెన్స్ చేసిందన్న ఆరోపణలను ఖండించింది. ఎయిరిండియా, తుర్కిష్‌ టెక్నిక్‌ మధ్య 2024-25 మధ్య ఒప్పందం జరగ్గా అందులో బీ777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్ చేసేలా డీల్ కుదిరిందని పేర్కొంది. విమానయాన పరిశ్రమలో భద్రత, నిర్వహణలో పూర్తి నిబద్ధతతో ఉంటామని వెల్లడించింది. ఎయిరిండియాకు చెందిన ఇలాంటి విమానానికి ఇప్పటి వరకు మెయింటెనెన్స్ చేయలేదని స్పష్టం చేసింది.

యోగా గురువు రాందేవ్ బాబా సంచలన ఆరోపణలు

కాగా యోగా గురువు రాందేవ్ బాబా తుర్కియే పై సంచలన ఆరోపణలు చేశారు. ఎయిరిండియా విమానాల మెయింటెనెన్స్ తుర్కియే టెక్నిక్ సంస్థ చూస్తుందని ప్రమాదానికి గురైన విమాన నిర్వహణను ఆ సంస్థే చూసిందని అన్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగి ఉండకపోవచ్చని తుర్కియే దేశం హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో పాకిస్థాన్‌కు తుర్కియే బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ఈ దేశానికి వందల సంఖ్యలో డ్రోన్లను పంపించింది. వాటితోనే పాకిస్థాన్ భారత్ పై దాడులకు దిగినట్లు ఇండియన్ ఆర్మీ కూడా ప్రకటించింది. దీంతో దేశంలోని వివిధ సంస్థలు ఇప్పటికే తుర్కియే తో వాణిజ్య, వ్యాపార సంబంధాలను తెంచుకోగా.. ఎయిరిండియా కూడా తుర్కియే మెయింటెనెన్స్ కంపెనీతో ఒప్పందం తగ్గించుకునే ప్రణాళికలో ఉంది. కాగా ఈ నేపథ్యంలో విమాన ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story