- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జులై 11న రానున్న అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదిక
ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక జులై 11న విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక జులై 11న విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 270 మంది మరణించగా, వారిలో 241 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రాథమిక నివేదిక 4–5 పేజీల తో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదానికి దారితీసిన కారణాలపై సమాచారం అందించనుంది.
అన్ని కోణాల్లో దర్యాప్తు
నివేదికలో విమానం మోడల్ (బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8), సిబ్బంది వివరాలు, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిస్థితులు, ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు, శిథిలాల సమాచారం , దర్యాప్తు అధికారుల వివరాలు ఉండనున్నాయి. ఈ నివేదిక దర్యాప్తు పురోగతిని సూచించడమే కాక, తదుపరి దశల్లో తీసుకోవాల్సిన చర్యలు, ఇంకా లోతుగా పరిశీలించాల్సిన అంశాలను తెలియజేసేలా చూడనుంది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ గత నెల నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) సంపూర్ణ విచారణ చేపట్టింది. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అనేక ఏజెన్సీలు ఈ దర్యాప్తులో భాగంగా పని చేస్తున్నాయి అని తెలిపారు






