- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అహ్మదాబాద్ విమాన ప్రమాదం..దర్యాప్తులో కీలకంగా మారిన బ్లాక్ బాక్స్
అహ్మదాబాద్ విమాన ప్రమాదం చరిత్రలోనే భారీ ప్రమాదంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన విమా

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదం చరిత్రలోనే భారీ ప్రమాదంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. డీఎన్ఏ పరీక్షల తరవాత మృతుల సంఖ్యను ధృవీకరిస్తామని అమిత్ షా ప్రకటించారు. అయితే విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటి అన్నది ఇంకా నిర్దారించలేదు.
ఈ ఘటనపై విచారణలో బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. విమాన ప్రమాదాలను గుర్తించడానికి దీనిని అమరుస్తుంటారు. ఇది ఆరెంజ్ కలర్‌లో ఉండే రికార్డింగ్ పరికరం. విమానం ప్రయాణించేటప్పుడు కాక్‌పిట్ క్రూ వాయిస్, ఇంజిన్ శబ్దాలు మరియు ఇతర శబ్దాలను ఇది రికార్డింగ్ చేస్తుంది. విమాన ప్రమాదం జరిగిన తరవాత దీనిలోని ఆధారాలను బట్టి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుంటారు. ఇక అహ్మదాబాద్ ప్రమాదంపై విచారణ జరిపేందుకు ఈ బాక్స్ కోసం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఘటనాస్థలానికి ఓ బృందాన్ని పంపిస్తోంది.






