- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా ఇరాన్ దాడుల తర్వాత, బంకర్ బ్లస్టర్ క్షిపణి ప్రాజెక్టు వేగవంతం చేసిన భారత్
గత వారం అమెరికా, ఇరాన్‌లోని ఫోర్దో అణు కేంద్రంపై అత్యాధునిక GBU-57/A మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులతో దాడులు చేసిన నేపథ్యంలో భారత్ తన బంకర్‍బ్లస్టర్ సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది

దిశ, నేషనల్ బ్యూరో: గత వారం అమెరికా, ఇరాన్‌లోని ఫోర్దో అణు కేంద్రంపై అత్యాధునిక GBU-57/A మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులతో దాడులు చేసిన నేపథ్యంలో భారత్ తన బంకర్‍బ్లస్టర్ సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. భూగర్భ లక్ష్యాలను ఛేదించగల శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ అవసరమని ప్రపంచ సంఘర్షణలు ఇండియాకు సూచిస్తున్నాయి. డీఆర్‌డీఓ ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణికి భారీ పేలోడ్ సామర్థ్యం కలిగిన వేరియంట్‌లను రూపొందిస్తోంది. ఈ కొత్త క్షిపణి వ్యవస్థ 7500 కిలోగ్రాముల బంకర్-బస్టర్ వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలగడం ద్వారా భూగర్భంలో 80 నుంచి 100 మీటర్ల లోతులో దాగిన శత్రు సదుపాయాలను ధ్వంసం చేయగలదు.
నేరుగా లక్ష్యాలే టార్గెట్..
ఈ క్షిపణుల రూపకల్పనలో, అమెరికా GBU-57 మాదిరిగానే భారీ పేలోడ్ సామర్థ్యం మీద దృష్టి పెట్టారు. వాటిని పెద్ద బాంబర్ విమానాల ద్వారా మోహరించాల్సిన అవసరం లేకుండా, క్షిపణుల ద్వారా నేరుగా లక్ష్యాన్ని ఛేదించగలుగుతాయి. స్వల్ప ఖర్చుతో అధిక ఫలితాన్ని సాధించగల వ్యూహాత్మక మార్గం. అగ్ని-5 రెండు వేరియంట్‌లు అభివృద్ధిలో ఉన్నట్లు సమాచారం. ఒకటి వార్‌హెడ్ తో భూభాగం పై ఉన్న లక్ష్యాల కోసం, మరొకటి కాంక్రీట్ తో కూడిన లేదా భూగర్భ లోపల ఉన్న బంకర్ లాంటి లక్ష్యాలను ఛేదించేందుకు డీప్-పెనెట్రేటింగ్ వార్‌హెడ్‌తో రూపొందించబడుతోంది. ఇవి 8 టన్నుల వరకు బరువు కలిగిన పేలోడ్‌లను మోసుకెళ్లగలగడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణులుగా పేరుపొందాయి.
పాకిస్థాన్, చైనా అణు, సైనిక కేంద్రాలపై దాడి చేసేలా..
ఈ కొత్త సాంకేతికతలు పాకిస్తాన్, చైనా వంటి ప్రత్యర్థుల కమాండ్ సెంటర్లు, అణు కేంద్రాలు, సైనిక మౌలిక సదుపాయాలపై కచ్చితత్వంతో దాడి చేయగలిగే సామర్థ్యాన్ని భారత్‌కు అందించనున్నాయి. మాక్ 8 నుంచి మాక్ 20 మధ్య గరిష్ఠ వేగాన్ని అందుకోవడంతో వీటిని హైపర్‌సోనిక్ ఆయుధాలుగా పిలుస్తారు.వీటిని బంకర్ బ్లస్టర్ బాంబులతో పోల్చుతారు. అమెరికా సాంకేతికతతో వేగంలో సమానంగా ఉన్నా, పేలోడ్ పరంగా ఎక్కువ శక్తివంతంగా ఉండే ఈ స్వదేశీ వ్యవస్థలు, భారత రక్షణ రంగంలో స్వావలంబనకు దృఢ సంకేతంగా నిలుస్తాయి.






