విపత్తు కాదు వివక్షే మహిళల ప్రాణాలు తీసింది.. స్త్రీలను పరాయి వ్యక్తి ముట్టుకోరాదన్న నిబంధన.. ప్రాణాలు పోతున్న చేయి అందివ్వలేదు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-06 10:30:14  IST  )

ఆప్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సరే విపత్తు కారణంగా ప్రాణాలు పోయాయంటే ఓ లెక్క. కానీ ఇక్కడ మహిళల ప్రాణాలు తీసింది భూకంపం కాదు తాలిబన్ల కఠిన లింగ నియమాలు. ఇతర పురుషులు స్త్రీలను తాకరాదు.. స్కిన్ కాంటాక్ట్ చేయరాదు..

విపత్తు కాదు వివక్షే మహిళల ప్రాణాలు తీసింది.. స్త్రీలను పరాయి వ్యక్తి ముట్టుకోరాదన్న నిబంధన.. ప్రాణాలు పోతున్న చేయి అందివ్వలేదు..
X

దిశ, వెబ్ డెస్క్: ఆప్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సరే విపత్తు కారణంగా ప్రాణాలు పోయాయంటే ఓ లెక్క. కానీ ఇక్కడ మహిళల ప్రాణాలు తీసింది భూకంపం కాదు తాలిబన్ల కఠిన లింగ నియమాలు. ఇతర పురుషులు స్త్రీలను తాకరాదు.. స్కిన్ కాంటాక్ట్ చేయరాదు.. అనే పిచ్చి లింగ వివక్ష నియమం ఇక్కడ కూడా అప్లయ్ చేశారు. రెస్క్యూ టీమ్స్ కళ్ల ముందే స్త్రీల ప్రాణాలు పోతున్నా.. రక్షించే దూరంలో ఉన్నా.. కనీస జాలి, దయ లేకుండా అలాగే వదిలేశారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. చనిపోయిన స్త్రీలను బయటకు లాగారు కానీ బతికున్న మహిళలకు చేయి అందించలేక పోయారు. శిథిలాల కింద చిక్కుకుని గోడు గోడున ఏడుస్తున్నా కనికరించలేదు. లింగ వివక్ష నియమానికే కట్టుబడి ఉన్నారు. దీంతో గంటలు కాదు రోజుల తరబడి ఆ శిథిలాలే కిందే ఉండి ప్రాణాలు కోల్పోయారు. ఫిమేల్ రెస్క్యూయర్స్ తక్కువగా ఉన్నారని తెలిసి కూడా తమ మొండి, అర్థం పర్థం లేని లింగ వివక్షకు కట్టుబడి ఉన్నారు. విపత్తు వల్ల కాదు వివక్ష వల్ల దాదాపు 2300 మంది ప్రాణాలు పోయేందుకు కారణమయ్యారు.

* తాలిబాన్ ఇస్లామిక్ చట్ట వివరణ కఠినమైన లింగ విభజనను అమలు చేస్తుంది. బంధువులు కాని స్త్రీలను శారీరకంగా టచ్ చేయడాన్ని నిషేధిస్తుంది. దీంతో తక్షణ రెస్క్యూ కార్యకలాపాలకు దూరమయ్యారు స్త్రీలు.

* తాలిబాన్ ప్రకారం మహిళలు పబ్లిక్‌గా కనిపించకూడదు. ముఖం కనిపించకుండా పూర్తిగా కప్పుకుని ఉండాలి. ముఖ్యంగా జాబ్ చేయకుండా నిబంధనలు తీసుకొచ్చాయి. దీంతో ఎమర్జెన్సీ సమయంలో ఇలా జరిగింది. రోజుల తరబడి సహాయం కోసం ఎదురుచూసిన స్త్రీలు మరణించాల్సి వచ్చింది.

* భూకంపానికి ముందు సాంస్కృతిక, వ్యవస్థాపక అడ్డంకులే ఈ ఘోరానికి కారణమయ్యాయి. మహిళల విద్య, ఉపాధి, స్వేచ్ఛపై కఠినంగా వ్యవహరించడం వల్ల మహిళా రెస్క్యూయర్స్ సంఖ్య తగ్గింది.

* కానీ జీవన్మరణ సందర్భాల్లో కూడా ఇంత కఠిన నియమాలు దేనికి? ఏ దేవుడైనా ఇలా ఉండమని చెప్తాడా? మానవత్వం కంటే భావజాలం అంత గొప్పదా? అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది.

Next Story