పాకిస్థాన్ భారీ దాడి.. 400 మంది మృతి!

by velandi.Saikiran |

ఆఫ్ఘనిస్తాన్ లోని ఆసుపత్రి పై పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ సంఘటనలో ఏకంగా 400 మంది మృతి చెందారు.

పాకిస్థాన్ భారీ దాడి.. 400 మంది మృతి!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆఫ్ఘనిస్తాన్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ తెగబడింది. ఆఫ్ఘనిస్తాన్ లోని ఓ ఆసుపత్రి పై పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ సంఘటనలో ఏకంగా 400 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా తాలిబ‌న్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు మరో 250 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.

కాబూల్ లో డ్రగ్స్ కు బానిస అయిన వారికి చికిత్స అందించే ఆసుపత్రి పై ఈ అటాక్ జరిగినట్లు స్థానిక ఆఫ్ఘనిస్తాన్ మీడియా స్పష్టం చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని పాకిస్తాన్ స్పష్టం చేస్తోంది. ఆసుపత్రులను తాము లక్ష్యంగా చేసుకోలేదంటూ ఆఫ్ఘనిస్తాన్ చేసిన ప్రకటనను ఖండించింది పాకిస్తాన్‌. ఇక ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story