- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో అద్దంకి విద్యార్థి మిస్సింగ్.. 10 రోజులైనా దొరకని ఆచూకీ
అమెరికాలో టూర్ కు వెళ్లిన అద్దంకి విద్యార్థి మిస్సయ్యాడు. 10 రోజులు గడిచినా ఆచూకీ తెలియకపోవడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో టూర్ కు వెళ్లిన అద్దంకి విద్యార్థి మిస్సయ్యాడు. 10 రోజులు గడిచినా ఆచూకీ తెలియకపోవడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. హరి హ్యూస్టన్లో ఉంటున్నాడు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 22న పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఒంటరిగా ఆలాస్కాకు వెళ్లాడు. అక్కడ డెనాలికి దగ్గర్లో ఒక హోటల్ లో బసచేసిన హరి.. జనవరి 3-4 తేదీల్లో తిరిగి వస్తానని తన రూమ్ మేట్స్ కు చెప్పాడు. డిసెంబర్ 30న చివరిగా కుటుంబ సభ్యులు స్నేహితులతో మాట్లాడారు. 31న హోటల్ నుంచి బయటకు వెళ్లి ఒక క్యాబ్ సర్వీస్ ను వాడాడు. ఆ తర్వాత హరి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అప్పటి నుంచి అతని నుంచి ఎలాంటి ఫోన్ కాల్ లేదా మెసేజ్ లేదని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ చెప్తున్నారు. హోటల్ నుంచి హరి ఎక్కడికి వెళ్లాడు ? ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరు? కిడ్నాకు గురయ్యాడా? లేక ఇంకేదైనా ప్రమాదం జరిగిందా? వంటి కోణాల్లో అమెరికా పోలీసులు విచారణ చేస్తున్నారు.






