- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్‌లో 80% మంది స్వలింగ సంపర్కులే..! యాక్టివిస్ట్ హీనా బలూచ్ సంచలన కామెంట్స్ వైరల్
పాకిస్తాన్ సామాజిక పరిస్థితులు, లైంగిక ధోరణులపై ఆ దేశానికి చెందిన ప్రముఖ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ హీనా బలూచ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్ సామాజిక పరిస్థితులు, లైంగిక ధోరణులపై ఆ దేశానికి చెందిన ప్రముఖ ట్రాన్స్‌జెండర్ (ఖవాజా సిరా) యాక్టివిస్ట్ హీనా బలూచ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాకిస్తాన్‌లో 80 శాతం మంది స్వలింగ సంపర్కులు (గేలు) కాగా, మిగిలిన 20 శాతం మంది బైసెక్సువల్స్ అని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ‘క్వీర్ గ్లోబల్’ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
అందరికీ తెలిసిన రహస్యమే..
పాకిస్థాన్‌లో ఎవరూ పూర్తిగా ‘స్ట్రెయిట్’ (భిన్న లింగ సంపర్కులు) కాదని హీనా అభిప్రాయపడ్డారు. దేశంలో స్వలింగ సంపర్కం అనేది అత్యంత సాధారణ విషయమని, ఇదొక ‘ఓపెన్ సీక్రెట్’ అని ఆమె పేర్కొన్నారు. కానీ మతం, సంస్కృతి, కుటుంబ పరువు పేరుతో సమాజం ఈ నిజాన్ని బయటికి అంగీకరించదని విమర్శించారు. కరాచీలో పెరిగిన తాను చిన్నతనంలో ఎదుర్కొన్న వివక్షను ఆమె గుర్తుచేసుకున్నారు. ఆడపిల్లలా అలంకరించుకోవడం, లిప్‌స్టిక్ వేసుకోవడం, నగలు ధరించడం వల్ల ఇంట్లో ఎక్కడ దెబ్బలు తినాల్సి వస్తుందోనని నిత్యం భయపడుతూ బతికేదాన్నని ఆవేదన వ్యక్తం చేశారు.
పోరాటం - దేశ బహిష్కరణ
ట్రాన్స్‌జెండర్లకు సంప్రదాయబద్ధంగా మిగిలిన అడుక్కోవడం, వ్యభిచారం లాంటి వృత్తులను తిరస్కరించి హీనా హక్కుల కార్యకర్తగా మారారు. పాకిస్తాన్‌లో ‘సింధ్ మూరత్ మార్చ్’, ‘ఔరత్ మార్చ్’ లాంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే, ఓ నిరసనలో ‘ప్రైడ్ ఫ్లాగ్’ ఎగురవేసినందుకు పోలీసుల నుంచి వేధింపులు, కిడ్నాప్ వంటి హింసాత్మక ఘటనలు ఎదుర్కొని ప్రాణభయంతో దేశం విడిచిపెట్టినట్లు జాతీయ మీడియా వార్త కథనాలు ఉన్నాయి. పాకిస్తాన్ వీడిన అనంతరం లండన్‌లోని SOAS యూనివర్సిటీలో స్కాలర్‌షిప్ సాధించిన హీనా, ప్రస్తుతం యూకేలో శరణార్థిగా ఆశ్రయం కోరుతున్నారు. అయితే బ్రిటన్ ఆశ్రయ విధానం సైతం ఓపెన్-ఎయిర్ జైలును తలపిస్తోందని ఆమె విమర్శించడం గమనార్హం.






