- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Covid cases: భారత్ లో యాక్టివ్ కొవిడ్ కేసులు 7400.. కర్ణాటకలో పెరుగుదల
ఇండియాలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 7400కు చేరుకున్నాయి.నిన్న ఒక్క రోజే 269 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో తొమ్మిది మరణాలు సంభవించినట్లు పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియాలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 7400కు చేరుకున్నాయి.నిన్న ఒక్క రోజే 269 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో తొమ్మిది మరణాలు సంభవించినట్లు పేర్కొంది. కర్ణాటకలో అత్యధికంగా 132 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. గుజరాత్ (79), కేరళ (54) మధ్యప్రదేశ్ (20) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సిక్కిం (11), తమిళనాడు (12) హర్యానా (9) లాంటి రాష్ట్రా ల్లో 24 గంటల్లో యాక్టివ్ కొవిడ్ కేసులలో స్వల్ప పెరుగుదల కనిపించినట్లు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, లడఖ్, మిజోరాం, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లో ఎలాంటి కొవిడ్ కేసులు నమోదు కాలేవని పేర్కొంది.
కోలుకున్న 991 మంది
గత 24 గంటల్లో 991 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 11,967 కి చేరుకుంది. కొవిడ్ కారణంగా కేరళ అత్యంత ప్రభావితమైన రాష్ట్రంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు యాక్టివ్ సంఖ్య 2,109, గుజరాత్ (1,437) ఢిల్లీ (672) ఉన్నాయి. అధిక సంఖ్యలో యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్న ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్ర (613), కర్ణాటక (527), ఉత్తరప్రదేశ్ (248), తమిళనాడు (232), రాజస్థాన్ (180) ఆంధ్రప్రదేశ్ (102) ఉన్నాయి. కర్ణాటకతో పాటు మణిపూర్, రాజస్థాన్‌లలో కేసులు పెరిగాయి.






