Anna University student case : అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచార కేసులో నిందితుడికి జీవిత ఖైదు

by Shamantha N |

చెన్నై అన్నా యూనివర్శిటీలో విద్యార్థిని అత్యాచార కేసులో దోషిగా తేలిన బిర్యానీ వ్యాపారి జ్ఞానశేఖరన్‌కు మహిళా కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ.90,000 జరిమానా , కనీసం 30 సంవత్సరాలు జైలులో ఉండాల్సిందేనని న్యాయమూర్తి ఎం.రాజలక్ష్మి సోమవారం తీర్పు వెలువరించారు.

Anna University student case : అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచార కేసులో నిందితుడికి జీవిత ఖైదు
X

దిశ, నేషనల్ డెస్క్: చెన్నై అన్నా యూనివర్శిటీలో విద్యార్థిని అత్యాచార కేసులో దోషిగా తేలిన బిర్యానీ వ్యాపారి జ్ఞానశేఖరన్‌కు మహిళా కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ.90,000 జరిమానా , కనీసం 30 సంవత్సరాలు జైలులో ఉండాల్సిందేనని న్యాయమూర్తి ఎం.రాజలక్ష్మి సోమవారం తీర్పు వెలువరించారు. గతేడాది డిసెంబర్ 23న జ్ఞానశేఖరన్ అన్నా యూనివర్శిటీకి వెళ్లి, 19 ఏళ్ల విద్యార్థిని కిడ్నాప్ చేసి, ఆమె స్నేహితుడిపై దాడి చేశాడు. విద్యార్థినిని అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేయాలనుకున్నడని కోర్టు నిర్ధారించింది. ఘటన జరిగిన రోజే పోలీసులు నిందితుడిని అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో 29 మంది సాక్షులు 100 పేజీల చార్జ్‌షీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. మొత్తం 11 అభియోగాలతో అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. అతను తన వృద్ధ తల్లి, ఎనిమిదేళ్ల కుమార్తె బాధ్యతల్ని చూసుకోవాల్సిన అవసరం ఉందంటూ తక్కువ శిక్ష వేడుకున్నప్పటికీ మహిళా కోర్టు అంగీకరించలేదు.

బాధితురాలి వివరాలు బయటకు రావడంపై కోర్టు ఆగ్రహం

ఈ కేసులో బాధితురాలి వివరాలు ఎఫ్‌ఐఆర్ బయటపడడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బాధితుల గోప్యతను కాపాడాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘించారని విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల నిర్లక్ష్యంపై మహిళలతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కోర్టు ఏర్పాటు చేసింది. బాధితురాలికి ప్రభుత్వం తాత్కాలికంగా రూ.25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. నిందితుడు గతంలో కూడా అనేక చోరీలకు పాల్పడ్డట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై ప్రతిపక్ష ఏఐఏడీఎంకె అధికార డీఎంకేపై విమర్శలు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఈ ఘటనపై ప్రజలముందు కొరడాతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. జ్ఞానశేఖరన్‌ డీఎంకే సభ్యుడు అని బీజేపీ గతంలో ఆరోపించింది. అయితే డీఎంకే పార్టీ నేతలు మాత్రం అతడు కేవలం పార్టీ మద్దతుదారుడే, సభ్యుడు కాదని ఖండించారు.

Next Story