తమిళనాడులో తెలుగమ్మాయికి మంత్రి పదవి.. ఎవరీ కీర్తన?

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-11 04:35:02  IST  )

తమిళనాడులో నూతన మంత్రి వర్గం కొలువుదీరింది. విజయ్ సహా పదిమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో తెలుగమ్మాయి కీర్తన కూడా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమిళనాడులో తెలుగమ్మాయికి మంత్రి పదవి.. ఎవరీ కీర్తన?
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో నూతన మంత్రి వర్గం కొలువుదీరింది. విజయ్ సహా పదిమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో తెలుగమ్మాయి కీర్తన కూడా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు కొత్తమంత్రివర్గంలో యంగెస్ట్ కీర్తననే కావడంతో ఇప్పడు సోషల్ మీడియా అంతా ఆమె గురించే చర్చిస్తోంది. అసలు ఎవరు ఈ కీర్తన, ఇంత చిన్న వయసులో మంత్రిగా ఎలా ఎదిగింది అనుకుంటున్నారు. కీర్తన తెలుగు మూలాలు ఉన్న తమిళనాడు యువతి. ఒకప్పుడు వారి కుటుంబం ఏపీలో ఉండగా తరవాత కాలంలో తమిళనాడుకు షిఫ్ట్ అయ్యారు. ఇది వరకు ఆమె షోటైమ్ అనే పొలిటికల్ కన్సల్టెన్సీలో స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు.

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపు కోసం ఆమె పనిచేశారు. కీర్తన తండ్రి కూడా రాజకీయనాయకుడే అయినా నేరుగా జనాల్లోక వెళుతూ ఆమె తండ్రిని మించిన తనయ అనిపించుకున్నారు. కీర్తన శివకాశి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయగా మంచి మెజారీటీతో విజయం సాధించారు. ఇక ఇప్పుడు విజయ్ కేబినెట్ లో ఆమెకు సంఘీక సంక్షేమ శాఖను కేటాయించారు. ఈమె ఓ మీడియా సమావేశంలో తెలుగులో మాట్లాడుతూ తెలుగువారికి మరింత దగ్గరయ్యారు. కీర్తన పోటీ చేసిన నియోజకవర్గంలోనూ తెలుగువారు ఎక్కుడ ఉండటం ఆమెకు కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలోనూ ఈ నియోజకవర్గంలో తెలుగు మూలాలు ఉన్న నేతలే కీలక పాత్ర పోశించారని చెబుతున్నారు.

Read More.. సీఎం విజయ్‌కు త్రిష విషెస్.. ఇవాళ నేను సూపర్ హ్యాపీ అంటూ..

Next Story