- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకరోజు పెళ్లి, మరుసటిరోజే విదవరాలిగా.. తమిళనాడులో హిజ్రాల వింత సంప్రదాయం
తమిళనాడులో ప్రారంభమైన హిజ్రాల 18 రోజుల పెళ్లి వేడుక గురువారంతో పూర్తైంది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవగంలోని కూటండవార్ ఆలయంలో జరిగే ఈ వేడుక ప్రపంచవ్యాప్తంలోనే అతిపెద్ద ట్రాన్స్ జెండర్ల పండుగగా ప్రసిద్ధి చెందింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో ప్రారంభమైన హిజ్రాల 18 రోజుల పెళ్లి వేడుక గురువారంతో పూర్తైంది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవగంలోని కూటండవార్ ఆలయంలో జరిగే ఈ వేడుక ప్రపంచవ్యాప్తంలోనే అతిపెద్ద ట్రాన్స్ జెండర్ల పండుగగా ప్రసిద్ధి చెందింది. ప్రదిఏడాది దాదాపు లక్షాయాభైవేల మంది ట్రాన్స్ జెండర్లు ఇక్కడకు వచ్చి వివాహవేడుకలో పాల్గొంటారు. ఈ ఆచారం అనాదిగా వస్తుండగా ఎంతో వింతగా ఉంటుంది కూడా. ఇక్కడకు వచ్చే ట్రాన్స్ జెండర్లు అరవన్ అనే దేవుడిని పెళ్లి చేసుకుంటారు. అరవన్ అంటే అర్జునుడి కొడుకు అని నమ్ముతారు.
ఇది మహాభారతంలోని ఒక గాథ ఆధారంగా సాగుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం కోసం అరవాన్ తనను తాను బలి ఇచ్చుకోవడానికి సిద్ధపడతాడు. అయితే, బలి కావడానికి ముందు తనకు వివాహం కావాలని కోరుకుంటాడు. కానీ ఒక్క రోజు కోసం అరవాన్ ను ఏ మహిళ కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. దాంతో శ్రీకృష్ణుడే మోహిని రూపం ధరించి అరవాన్ ను వివాహం చేసుకుంటాడు. మరుసటి రోజు అరవాన్ బలి తరవాత మోహిని వితంతువుగా మారుతుంది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే హిజ్రాలు విల్లుపురం కూతండవార్ ఆలయంలో ప్రతి ఏటా చిత్త శుద్ధ పౌర్ణమి సమయంలో ఈ ఉత్సవం జరుపుకుంటారు. పెళ్లైన మరుసటి రోజే తాళి తెంచుకుని, గాజులు పగులకొట్టుకుని కుంకుమ చెరిపేసి విదవరాలిగా మారతారు.
ఈ వేడుకలో పూజారే అందరికీ తాళి కడతాడు. పద్దెనిమిదిరోజుల పాటు సాగే ఈ వేడుకలో హిజ్రాలు తమను తాము మోహినిలుగా భావిస్తారు. దీనివల్ల దేవుడితో తమకు వివాహం జరిగిందని భావించి ఆ రాత్రంతా పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడుపుతారు. పెళ్లి జరిగిన మరుసటిరోజు ఉదయం అరవాన్ బలిని స్మరిస్తూ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు. తరవాత విదవరాలిగా మారి కన్నీళ్లు పెట్టుకుని బాధపడతారు. ఇక ఇక్కడ జరిగే వేడుక చూసేందుకు భక్తులు కూడా పెద్దఎత్తున వస్తుంటారు. వేడకకు వచ్చే ట్రాన్స్ జెండర్ల అందం చూసి ఫిదా అవ్వాల్సిందే అని వేడుక గురించి చెప్పుకుంటారు.






