- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికన్ స్కూల్లో భారతజాతీయుల్ని ఇలా వేధిస్తున్నారా..?! వైరల్ వీడియో
ఇలాంటి చోట జాతి వివక్ష చాలా దారుణమైన విషయం. An Indian American student being bullied in Texas School

దిశ, వెబ్‌డెస్క్ః అమెరికా అంటేనే స్వేచ్ఛా జీవులకు నెలవుగా ఆ దేశస్థులు ప్రచారం చేస్తారు. అయితే, చరిత్రలో నిగ్రోలపై అమెరికన్లు చూపించిన బానిసత్వం ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదని చెప్పొచ్చు. నిజానికి అమెరికా ఏ జాతీకి చెందినది కాదు. సంకరజాతి సమూహమే అమెరికాగా ఏర్పడిందనేది చరిత్ర చెబుతోంది. ఇలాంటి చోట జాతి వివక్ష చాలా దారుణమైన విషయం. అమెరికాలో భారతీయులు కూడా ఎక్కువగా ఉండబట్టే ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా ఓ ఇండో-అమెరికన్ ఎంపికయ్యిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆ దేశంలోని టెక్సాస్‌లో భారతీయ అమెరికన్ విద్యార్థి వేధింపులకు గురవుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది జనాగ్రహానికి, తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ క్లాస్‌లోని తోటి విద్యార్థులు తీసిన ఈ వీడియోలో ఒక విద్యార్థి బెంచ్‌పై కూర్చున్న భారతీయ అమెరికన్ అబ్బాయిని సమీపించి, లేచి నిలబడమని అంటాడు. ఆ సీటు పైనుండి నేను ఎందుకు లేవాలి, ఏ కారణం లేకుండా నేను లేవనని బాధిత విద్యార్థి చెబుతాడు. కానీ, అమెరికన్ విద్యార్థి కోపంగా, బాధితుణ్ని మెడపట్టి కిందికి వంచి, పడేయడం వీడియోలో కనిపిస్తుంది. ఈ సంఘటన టెక్సాస్‌లోని కొప్పెల్ మిడిల్ స్కూల్‌లో జరిగింది. అయితే, దాని సూపరింటెండెంట్ డా. బ్రాడ్ హంట్ ఈ ఘటనపై స్పందించారు. ఇలాంటి చర్యలు ఎప్పటికీ సంహించమని, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే, ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకూ పనిష్మెంట్ ఇవ్వగా, NBCDFW ప్రకారం, వేధింపులకు గురైన విద్యార్థికి మూడు రోజుల సస్పెన్షన్, అమెరికన్ విద్యార్థికి ఒకరోజు సస్పెన్షన్ ఇవ్వడం గమనార్హం. దీనిపై బాధితుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, పాఠశాలలో ఈ సంఘటనపైన అంతర్గత విచారణ కొనసాగుతున్నందున తల్లిదండ్రులు ఇప్పుడు న్యాయపరమైన సహాయం కోసం ఆలోచిస్తున్నారు. అయితే, ఈ ఇండియన్ అమెరికన్ బాయ్‌కి మద్దతుగా 150,000 కంటే ఎక్కువ మంది సంతకాలు చేసిన ఆన్‌లైన్ పిటిషన్ కూడా బయటకు రావడం విశేషం.
14 y/o at Coppell Middle School North gets assaulted in the cafeteria, while students just watched.
— Malini Basu (@MaliniBasu_) May 16, 2022
Teen in chokehold faced 3days of punishment. His parents are outraged. Other teen faced 1 day of punishment.
Teen tells me, he didn't want to fight back, & get in trouble.@wfaa pic.twitter.com/f2Clha8qpF






