- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాటేసిన పామును కొరికి చంపిన రెండేళ్ల చిన్నారి
దిశ, వెబ్‌డెస్క్: చిన్న పిల్లలు ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతుంటారు. ఆడుకుంటు వారికి తెలియకుండా వారు పెద్ద ప్రమాదంలో చిక్కుకున్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: చిన్న పిల్లలు ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతుంటారు. ఆడుకుంటు వారికి తెలియకుండా వారు పెద్ద ప్రమాదంలో చిక్కుకున్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు టర్కీ ప్రావిన్స్‌లోని బింగోల్ నగరంలోని కాంటార్ గ్రామంలో రెండేళ్ల చిన్నారి ఆడుకుంటు వాళ్ల ఇంటి వెనకాల కు వెళ్ళింది. ఆడుకుంటుండగా ఆ చిన్నారిని పాము కాటు వేసింది. పాము కాటు వేయడంతో ఆ చిన్నారి పట్టుకుని కసితీరా కొరికిచంపి ప్రతీకారం తీర్చుకుంది.
చిన్నారి అరుపులు విన్న తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి చూసే సరికి పక్కన పాము చనిపోయి ఉంది. అంతేకాకుండా పాపను పాము కాటు వేసిందా.. అని పరిశీలించగా పెదాలపై రెండు కాట్లు కనిపించాయి. దాదాపు గా ఆ పాము 50 సెం.మీ. 20 అంగుళాలు ఉంది. ఇది గమనించిన తల్లి స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం.
Next Story






