ఉక్రెయిన్‌లో ఘోర Helicopter ప్రమాదం.. 16 మంది స్పాట్ డెడ్ (వీడియో)

by Disha Web Desk 2 |
ఉక్రెయిన్‌లో ఘోర Helicopter ప్రమాదం.. 16 మంది స్పాట్ డెడ్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో హెలికాప్టర్ కూలి 16 మంది మరణించారు. బ్రోవరీ పట్టణంలోని ఓ కిండర్ గార్డెన్ స్కూల్ వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో మంటలు అంటుకోవడంతో 16 మంది మృత్యువాత పడ్డారు. మృతులలో ఉక్రెయిన్ అంతర్గత మంత్రి కూడా ఉన్నారు. మరో ఇద్దరు చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత ఘటన స్థలానికి అత్యవసర సేవల బృందాలను పంపినట్టు ఉక్రెయిన్ అధ్యక్ష సహాయకుడు తెలిపారు. ప్రమాదం సమయంలో స్కూల్ లో విద్యార్థులతో పాటు సిబ్బంది ఉన్నారని, ప్రస్తుతం వారందరిని ఇతర ప్రాంతాలకు తరలించినట్టు కీవ్ గవర్నర్ ఒలెక్సీ కులేబా వెల్లడించారు. అయితే హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణం ఏంటనేది తెలియరాలేదు.

ఈ ప్రమాదం తర్వాత రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే ఉక్రెయిన్ అధికారులు సైతం ఈ దాడి విషయంలో రష్యాపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదం సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన వెనుక రష్యా హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు అంతర్జాతీయ సమాజం నుంచి వ్యక్తం అవుతోంది. రష్యా దాడులను తట్టుకోవడానికి ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల మద్దతు కోరుతోంది. తమకు అధునాతన యుద్ధ ట్యాంకులు, ఇతర ఆయుధాలు సరఫరా చేయాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ గత వారం ఇతర దేశాలను కోరారు. ఇంతలోనే ఉక్రెయిన్ లో హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడం ఇందులో ఆ దేశ మంత్రి ప్రాణాలు కోల్పోవడం అనుమానాలకు తావిస్తోంది.


Next Story

Most Viewed