F-35B బ్రిటన్ ఫైటర్ జెట్ రిపేర్ కు 21 మంది నిపుణుల బృందం రాక

by Shamantha N |

బ్రిటన్‌కు చెందిన అధునాతన స్టెల్త్ యుద్ధవిమానం F-35Bను మరమ్మతు చేసేందుకు 21 మంది నిపుణుల బృందం ఆదివారం మధ్యాహ్నం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. ఈ బృందంలో ఏవియేషన్ ఇంజనీర్లు ఉన్నారు.

F-35B బ్రిటన్ ఫైటర్ జెట్ రిపేర్ కు 21 మంది నిపుణుల బృందం రాక
X

దిశ,నేషనల్ బ్యూరో: బ్రిటన్‌కు చెందిన అధునాతన స్టెల్త్ యుద్ధవిమానం F-35Bను మరమ్మతు చేసేందుకు 21 మంది నిపుణుల బృందం ఆదివారం మధ్యాహ్నం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. ఈ బృందంలో ఏవియేషన్ ఇంజనీర్లు ఉన్నారు. వారు RAF ZM417 , ఏయిర్‌బస్ A400M అట్లాస్ రకం విమానంలో మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో దిగారు. జూన్ 14 రాత్రి సాధారణ శిక్షణా సమయంలో ఇంధనం తక్కువగా ఉండటం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ ఫైటర్ జెట్ తిరువనంతపురంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇది యూకే రాయల్ నేవీకి చెందిన HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్అనే సంస్థ తయారు చేసినట్లు తెలుస్తోంది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సాంకేతిక బృందం పూర్తి స్థాయి మరమ్మతులకు యూకే బృందం సహాయం అవసరమని నిర్ధారించింది.

గాల్లో ఎగరకపోతే

బ్రిటిష్ ఇంజనీర్లు ప్రస్తుతం విమానాన్ని తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేసి మళ్లీ గాలిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యం కాకపోతే, దానిని విడిభాగాలుగా విడదీసి, C-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో యూకేకి ఎయిర్‌లిఫ్ట్ చేయనున్నారు. జెట్ ప్రస్తుతం విమానాశ్రయంలో ఉన్న ఒక ప్రత్యేక హ్యాంగర్‌కు తరలించబడినట్లు అధికారులు తెలిపారు. భారత ప్రభుత్వం సురక్షిత ల్యాండింగ్, లాజిస్టికల్ సపోర్ట్, భద్రతా ఏర్పాట్లు చేయడంతో యూకే, భారతదేశం మధ్య ఉన్న రక్షణ సహకారానికి మంచి ఉదాహరణగా నిలిచింది. ఇండో-పసిఫిక్‌లో భారత నావికాదళంతో ఇటీవల బ్రిటన్ నిర్వహించిన ఉమ్మడి విన్యాసాల సమయంలో ఈ ఫైటర్ జెట్ లో సమస్యలు తలెత్తాయి.

Next Story