- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్యాలో 125 మందితో వెళ్లిన విమానం మిస్సింగ్..? చివరికి ఏమైందంటే?
by Ramesh Naini |
రష్యాలో 125 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ బోయింగ్ 737-800 విమానం గాల్లో అదృశ్యమైనట్లు కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రష్యాలో 125 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ బోయింగ్ 737-800 విమానం గాల్లో అదృశ్యమైనట్లు కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. స్మార్టావియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం బుధవారం సాయంత్రం సోచి నుంచి (Arkhangelsk) అర్ఖంగెల్స్క్‌కు బయల్దేరింది. నల్ల సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం నుంచి అత్యవసర సంకేతాలు రావడంతో పాటు రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం మిస్సింగ్ అయినట్లు వార్తలు వెలువడ్డాయి.
అయితే కొద్దిసేపటికే పైలట్ విమానాన్ని తిరిగి సోచి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో 125 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.
Next Story






