- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారదర్శకంగా గిరిజన విద్యార్థుల ఎంపిక: జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల
గిరిజన విద్యార్థుల ఎంపికను పారదర్శకంగా చేపట్టడం జరిగిందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా అన్నారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో: గిరిజన విద్యార్థుల ఎంపికను పారదర్శకంగా చేపట్టడం జరిగిందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఎంపిక ప్రక్రియలో అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజిలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి జిల్లా స్థాయిలలో ఎంపికైన గిరిజన విద్యార్థులు 130 మందిని రాష్ట్రస్థాయిలో లాటరీ పద్ధతి ద్వారా ఒకటో తరగతిలో చేరేందుకు పారదర్శకంగా గిరిజన విద్యార్ధులను ఉప కులాల వారీగా 20 మందిని ఎంపిక చేశామని తెలిపారు.
ఇందులో రామంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 7 సీట్లు, బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 13 సీట్లు ఉన్నాయన్నారు. ఈ ప్రక్రియ మొత్తం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సూచనలు మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ పద్ధతి ప్రక్రియ నిర్వహించడం వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులు పాఠశాలలో చేరని యెడల వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి అవకాశం ఉంటుందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గోపాల్, ప్రధానోపాధ్యాయురాలు అముక్త మాల్యద, బి.లాలు, జి.యాదయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






