బీఆర్ఎస్ దిమ్మెలను కూలిస్తే, మాడి మసి అయిపోతావ్

by velandi.Saikiran |   (  Updated:2026-06-18 13:13:48  IST  )

బీఆర్ఎస్ దిమ్మెలను కూలిస్తే మాడి మాడి మసి అయిపోతావ్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి.

బీఆర్ఎస్ దిమ్మెలను కూలిస్తే, మాడి మసి అయిపోతావ్
X

దిశ, నాగర్ కర్నూల్ : బీఆర్ఎస్ దిమ్మెలను కూలిస్తే మాడి మాడి మసి అయిపోతావ్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చడం నీ గురువు చంద్రబాబు వల్లే కాలేదు నీ వల్ల ఏమవుతుంది..? అంటూ చుర‌క‌లు అంటించారు. మా పార్టీ దిమ్మెను టచ్ చేసి మగాడు ఇంకా పుట్టలేదని మర్రి జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న జడ్చర్ల లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చి చేస్తామన్న వ్యాఖ్యలకు మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ పవర్ ఏందో మీ సోనియాగాంధీని అడిగి తెలుసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి సూచించారు. మూడు కోట్ల తెలంగాణ ప్రజలను ఆకాంక్షను నెరవేర్చింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. మీ పేరుకు ముందు సీఎం ట్యాగ్ ను ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కదా ? అంటూ ప్ర‌శ్నించారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి అరిగోస పెడుతున్నావని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Next Story