చంకల్లో దుర్వాసనతో ఇబ్బందులా..? ఈ చిట్కా పాటిస్తే చాలు!

by Javid Pasha |

నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి చర్మంపై ఆమ్ల వాతావరణాన్ని సృష్టిస్తాయి. చంకల్లో దుర్వాసనకు కారణమయ్యే కొన్ని బ్యాక్టీరియాలను నివారిస్తాయి.

చంకల్లో దుర్వాసనతో ఇబ్బందులా..? ఈ చిట్కా పాటిస్తే చాలు!
X

దిశ, ఫీచర్స్ : బయటి వాతావరణంలో ఎక్కువసేపు తిరిగినప్పుడు లేదా ఉక్కబోతలతో చెమట పట్టినప్పుడు శరీరం నుంచి, ముఖ్యంగా చంకల్లో నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. తర్వాత స్నానం చేసినప్పుడు ఇది సహజంగానే పోతుంది. కానీ కొందరికి ఇన్ఫెక్షన్ అవడంవల్ల ఆ వాసన పోకపోవచ్చు. అలాంటప్పుడు నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాక్టీరియాను నింయంత్రిస్తుంది

నిమ్మకాయను ఇప్పుడు ఆధునిక మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తున్నారు. అయితే ప్రాచీన కాలం నుంచి చాలా సంస్కృతుల్లో కూడా లెమన్‌ను శరీర వాసన (Body odor) నివారణకు ఉపయోగించేవారు. ఎందుకంటే.. ఇందులో సమృద్ధిగా ఉండే సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి చర్మంపై ఆమ్ల (acidic) వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది శరీర దుర్వాసనకు వాసనకు కారణమయ్యే కొన్ని బ్యాక్టీరియాల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే శరీరం లేదా చంకల నుంచి వచ్చే చెమటే కాదు, ఆ చెమటను బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేయడం వల్ల కూడా వాసన వస్తుంది. నిమ్మకాయ రసంలో ఆ బ్యాక్టీరియా చర్యను తగ్గించి వాసనను తగ్గించే గుణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

సహజమైన మెడిసిన్‌గా..

ఆధునిక డియోడరంట్లు కూడా చెమట ఉత్పత్తిని, దుర్వాసనను అడ్డుకుంటాయి (antiperspirant), అయితే నిమ్మకాయ ఇందుకు భిన్నంగా మరింత శక్తివంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇది చెమట గ్రంథులను మూసివేయకుండా, చర్మంపై ఉండే బ్యాక్టీరియాను తాత్కాలికంగా నియంత్రించి వాసన తగ్గించే పని చేస్తుంది. ఇది సహజమైన పద్ధతి కాబట్టి చాలా మంది దీనిని సాంప్రదాయిక నివారణగా ఉపయోగిస్తుంటారు. శరీరం నుంచి, చంకల నుంచి దుర్వాసన సమస్యను ఎదుర్కొంటున్న వారికి సహజసిద్ధమైన మెడిసిన్ అని చెప్పవచ్చు. నిమ్మకాయను కట్ చేసి, దుర్వాసన వచ్చే భాగంలో రుద్ది, కాసేపటి తర్వాత స్నానం చేస్తే చాలు. ఆ వాసనపోవడమే కాకుండా, అందుకు కారణమయ్యే బ్యాక్టీరియాలు నాశనం అవుతాయి. అయితే తాజా నిమ్మకాయ రసం సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి చికాకు కలిగించవచ్చు. ముఖ్యంగా షేవ్ చేసిన తర్వాత తర్వాత లేదా గాయాలు ఉన్న చోట వాడితే మంటగా అనిపిస్తుంది. కాబట్టి అలాంటివారు వాడకూడదు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story