విత్తన దుకాణాలపై టాస్క్ ఫోర్స్ తనిఖీలు

by Jakkula.Mamatha |

ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో విత్తన దుకాణాలను టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎండీ తాజుద్దీన్, ఎస్సై ఎన్.వెంకటకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.

విత్తన దుకాణాలపై టాస్క్ ఫోర్స్ తనిఖీలు
X

దిశ,తల్లాడ: ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో విత్తన దుకాణాలను టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎండీ తాజుద్దీన్, ఎస్సై ఎన్.వెంకటకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. విత్తనాల ప్యాకెట్లు పరిశీలించి వాటి నాణ్యత పై ఆరా తీశారు. రైతుల అనుమతి పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, రసీదులు పొందాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటకృష్ణ మాట్లాడుతూ.. సీడ్ డీలర్స్ ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలు మాత్రమే అమ్మకాలు జరపాలని, అనుమతి లేని విత్తనాలు అమ్మినచో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

ప్రభుత్వం అనుమతి కలిగిన లైసెన్స్ దుకాణాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఎండి తాజుద్దీన్ మాట్లాడుతూ.. గ్రామాలలో కొందరు వ్యక్తులు లూజు విత్తనాలను అమ్మే అవకాశం ఉంటుంది. ఇటువంటి లూజు విత్తనాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనుగోలు చేయరాదని, అధిక దిగుబడి పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు వద్ద నుంచి విత్తనాలు కొనుగోలు చేయరాదని తెలిపారు. అదేవిధంగా రైతులు తమ ప్రాంతానికి, నేల రకానికి మరియు వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన వంగడాలు మాత్రమే ఎంచుకోవాలని సూచించారు.

Next Story