యుద్ధం వద్దని చిన్నారి ‘చిత్రం’.. రష్యా పోలీసులు ఏం చేశారంటే?

by Disha Web Desk 4 |
యుద్ధం వద్దని చిన్నారి ‘చిత్రం’.. రష్యా పోలీసులు ఏం చేశారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: యుద్ధం వద్దని ఓ చిన్నారి వేసిన చిత్రం రష్యా పోలీసుల ఆగ్రహానికి కారణమైంది. ఐదో తరగతి బాలిక వేసిన చిత్రంతో చిన్నారి తండ్రిని ఏడాది పోలీసులు హింసిస్తున్నారు. కేసు నమోదు చేసి తండ్రని నిర్భందించారు. ఉక్రెయిన్ పై సైనిక చర్య విషయంలో ప్రపంచ దేశాలతో పాటు స్థానికంగానూ రష్యాపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐదో తరగతి చదువుతున్న ఓ రష్యన్ చిన్నారి గీసిన ‘చిత్రం’ శాపంగా మారింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి అధికారులు బాలిక తండ్రిపై ఏకంగా క్రిమినల్ కేసు నమోదు చేసారు.

చిన్నారిని తండ్రికి దూరంగా ప్రభుత్వ సంరక్షణ గృహానికి తరలించారు. మాషా మెస్కాలేవ్ అనే బాలిక తన తండ్రి అలెక్సీ మెస్కాలేవ్ తో కలిసి నివసిస్తోంది. తల్లి దూరంగా ఉంటోంది. ఐదో తరగతి చదువుతున్న బాలిక గతేడాది ఉక్రెయిన్ వార్ ప్రారంభమైన సమయంలో క్లాస్ రూంలో ఓ డ్రాయింగ్ వేసింది. తల్లి పక్కనే నిలబడి ఉన్న ఓ చిన్నారి.. రెండు దేశాల జాతీయ పతాకాలు అందులో ఉండగా రష్యా వైపు నుంచి క్షిపణులు దూసుకొస్తున్నట్లు డ్రాయింగ్ వేసింది.

డ్రాయింగ్ కి వార్ వద్దు, గుడ్ డేస్ ఫర్ ఉక్రెయిన్ అని రాసింది. ఈ చిత్రం చూసిన టీచర్ ప్రిన్సిపాల్ కు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. తండ్రికి 500 డాలర్ల జరిమానా విధించిన పోలీసులు.. చిన్నారిని అలాగే వదిలేస్తే భవిష్యత్తులో నాయకురాలు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు ఏప్రిల్ 6న విచారణకు రానుండగా చిన్నారి తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. పోలీసుల ఈ చర్యను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.


Next Story

Most Viewed