మెట్రో స్టేషన్ లోనే టాయిలెట్..షాకింగ్ వీడియో వైరల్!

by velandi.Saikiran |   (  Updated:2026-01-19 07:11:51  IST  )

మెట్రో స్టేషన్ లోనే టాయిలెట్ పోశాడు. ఎవరూ లేరని, మెట్రో స్టేషన్ లోని ఎక్సలేటర్ కింద శుభ్రంగా ఉన్న ప్రాంతంలోనే టాయిలెట్ పోశాడు.

మెట్రో స్టేషన్ లోనే టాయిలెట్..షాకింగ్ వీడియో వైరల్!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సోషల్ మీడియాలో రక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని భయానక వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి ఏకంగా మెట్రో స్టేషన్ లోనే టాయిలెట్ పోస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఫైనల్ గా మారింది.

మెట్రో స్టేషన్ లోనే టాయిలెట్

ఢిల్లీ మెట్రో స్టేషన్ చాలా రద్దీగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే జనాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఓ వ్యక్తి, నీచపు పనిచేశాడు. పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వం చెబుతూ ఉంటే, చదువుకుని ఉండి.. ఓ వ్య‌క్తి జంతువులాగా ప్రవర్తించాడు. మెట్రో స్టేషన్ లోనే టాయిలెట్ పోశాడు. ఎవరూ లేరని, మెట్రో స్టేషన్ లోని ఎక్సలేటర్ కింద శుభ్రంగా ఉన్న ప్రాంతంలోనే టాయిలెట్ పోశాడు.

అయితే వెనకాలే వచ్చిన ఓ వ్యక్తి వీడియో తీస్తూ బెదిరించాడు. దీంతో మధ్యలోనే తన పని ఆపేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. ఇలాంటి వాడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పబ్లిక్ తిరిగే ప్రదేశాల్లో ఇలాంటి పనులు చేసే వారిని... జనాల మధ్యలోనే శిక్షించాల‌ని కోరుతున్నారు.

Read More..

ప్రాణం తీసిన నిందారోపణ.. యువతి ఆరోపణలతో మనస్తాపం చెంది వ్యక్తి బలవన్మరణం





Next Story