- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ అగ్నిప్రమాదం.. సుమారు 1000 మంది.. కొనసాగుతున్న అత్యవసర సేవలు..
బెల్జియంలోని బూమ్‌లో జరిగే ప్రపంచ ప్రఖ్యాత టుమారోల్యాండ్ ఫెస్టివల్ కోసం ఏర్పాటు చేసిన మెయిన్ స్టేజ్‌పై భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జూలై 18న అధికారికంగా ఫెస్టివల్ ప్రారంభం కానుండగా.. ముందే ఈ ప్రమాదం సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్: బెల్జియంలోని బూమ్‌లో జరిగే ప్రపంచ ప్రఖ్యాత టుమారోల్యాండ్ ఫెస్టివల్ కోసం ఏర్పాటు చేసిన మెయిన్ స్టేజ్‌పై భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జూలై 18న అధికారికంగా ఫెస్టివల్ ప్రారంభం కానుండగా.. ముందే ఈ ప్రమాదం సంభవించింది. భారీ మంటలు, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఈ సమయంలో బాణసంచా కూడా పేలినట్లు తెలుస్తోంది. నిర్మాణ పనుల్లో ఫైనల్ టచింగ్, టెక్ రిహార్సల్స్ సమయంలో సంభవించిన ఈ అగ్నిప్రమాదానికి పైరోటెక్నిక్స్ పరీక్ష విఫలమవడమే కారణమని భావిస్తున్నారు. కానీ ఖచ్చితమైన కారణం దర్యాప్తు తర్వాతే తేలనుంది. సైట్‌లో ఉన్న సుమారు 1,000 మంది ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.
అయితే టుమారోల్యాండ్ నిర్వాహకులు ఫెస్టివల్ యథావిధిగా జరుగుతుందని ప్రకటించారు. ఈ రోజు డ్రీమ్‌విల్లే క్యాంప్‌సైట్ ఓపెన్ చేయబడుతుందని.. బ్రస్సెల్స్, ఆంట్‌వెర్ప్‌లలో గ్లోబల్ జర్నీ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని తెలిపారు. ప్రధాన స్టేజ్ దాదాపు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ.. నిర్వాహకులు స్కేల్-డౌన్ రీడిజైన్ లేదా సెకండరీ స్టేజ్‌ను ఉపయోగించేందుకు ఆలోచిస్తున్నారు. తద్వారా రెండు వారాంతాల్లో (జూలై 18-20, జూలై 25-27) సుమారు 400,000 మంది హాజరయ్యే ఈ ఫెస్టివల్ కొనసాగేలా చేస్తారు. స్థానిక అధికారులు సమీప నివాసితులను పొగ కారణంగా కిటికీలు, తలుపులు మూసివేయమని సూచించారు. అత్యవసర సేవలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.






