138 ఏళ్లకు ఆ కుటుంబంలో ఆడబిడ్డ!

by Sathputhe Rajesh |

ఆడబిడ్డ కోసం ఓ వంశం చూసిన ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి.

138 ఏళ్లకు ఆ కుటుంబంలో ఆడబిడ్డ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆడబిడ్డ కోసం ఓ వంశం చూసిన ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. 138 సంవత్సరాల తర్వాత ఆ వంశంలో తొలిసారి ఆడబిడ్డ జన్మించింది. యూఎస్‌కు చెందిన ఈ కుటుంబానికి చెందిన ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత మార్చిలో ఆండ్రీ అనే పాప జన్మించడంతో ఆ కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

పాప తల్లి కరోలిన్ మాట్లాడుతూ.. తన భర్త వైపు కుటుంబంలో 1885 నుంచి ఆడపిల్లలు పుట్టలేదని విని మొదట్లో తాను ఆశ్చర్యపోయానన్నారు. ఇప్పటికే తమకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. తాజాగా తమకు ఆడబిడ్డ జన్మించిందని సంతోషం వ్యక్తం చేసింది. తమ కుటుంబంలో ఎన్నో ఏళ్లకు పుట్టిన మొదటి ఆడబిడ్డ కావడంతో ఆండ్రీ తమకు ఎంతో ప్రత్యేకమైందని సంబరపడుతోంది.

Next Story