Viral Video: ఆ కుర్చీ మడతపడి..! చిన్నారిపై పడిన చైర్.. వెంటనే తల్లి చేసిన పనికి నెటిజన్‌లు షాక్..

by Ramesh Naini |

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రతి సన్నివేశాన్ని తమ ఫోన్‌లలో వీడియోలను చిత్రీకరించడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

Viral Video: ఆ కుర్చీ మడతపడి..! చిన్నారిపై పడిన చైర్.. వెంటనే తల్లి చేసిన పనికి నెటిజన్‌లు షాక్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral Video) ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రతి సన్నివేశాన్ని తమ ఫోన్‌లలో వీడియోలను చిత్రీకరించడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఫ్యామిలీలో వేడుకలు, బర్త్ డే సెలబ్రేషన్స్, పర్యాటక ప్రదేశాలు లాంటి వాటిని విజిట్ చేసినప్పుడు వాటి తాలూకా జ్ఞాపకాలు బంధించడం కోసం ఎవరైనా వీడియోలు, ఫోటోలు తీయడం తెలిసిందే. కానీ ఒక యాక్సిడెంట్ అయిన లేదా ఏదైనా ప్రమాదకర ఘటన జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న కొంత మంది ప్రమాదంలో ఉన్న వారిని కాపాడాల్సింది పోయి.. కొంత మంది తమ ఫోన్ కెమెరాలు ఓపెన్ చేసి వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు. మరోవైపు తమ పిల్లలు ఏ పని చేసిన తల్లిదండ్రులు ఆ క్షణాలను వీడియో క్రియేట్ చేయడం ఈ మధ్య బాగా పెరిగింది.

ఈ నేపథ్యంలోనే తాాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. చిన్నారి ఆటలాడుతున్న సమయంలో ఆకస్మాత్తుగా కుర్చీ పడింది. అయితే ఆ చిన్నారికి వెంటనే సహాయం చేయాల్సిన తల్లి, మొదట ఫోన్ తీసి ఆ క్షణాలను వీడియో తీయడం ప్రారంభించింది. ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్న పట్టించుకోకుండా ఆమె కొంత సమయం వరకు వీడియో తీయడం పైనే దృష్టి పెట్టింది. తాను అనుకున్నట్టు వీడియో తీయడం పూర్తి అయిన తర్వాతే చిన్నారిపై పడిన కుర్చీని తొలగించింది.

ఈ దృశ్యాలు సంబంధించిన సీసీ ఫుటేజీ బయటకు రావడంతో వీడియో చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. "తల్లి అయ్యి తన బిడ్డకు ముందుగా సహాయం చేయకుండా వీడియో తీయడం ఏంటి?" అని విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన తల్లిదండ్రుల బాధ్యతపై చర్చనీయాంశంగా మారింది. ప్రతి సందర్భంలో ఇలా వీడియోలు చేయడం తగదని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వీడియో, ఫోటోలు తీసే పనులు మానుకోవాలని కొందరూ నెటిజన్‌లు తల్లిదండ్రులకు సూచించారు. ఆ కుర్చీ చిన్నారిపై మడతపడి పడిపోతే ఎంటీ ఆ పనులు అని నెటిజన్‌లు చిన్నారి అమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ ట్వీట్ లింక్..

Next Story